సాధారణంగా 102 ఏళ్ల వయసున్న బామ్మ అంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు గుర్తుకు వస్తాయి. కనీసం సొంతంగా పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం 102 ఏళ్ల వయసులో స్కైడైవింగ్(Skydiving) చేసి ఔరా అనిపించింది.
బ్రిటన్ (Britain) లోని బెన్ హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన మానెట్ బైల్లీ(Manette Bailey) అనే బామ్మకు 102 సంవత్సరాలు. ఆదివారం తన పుట్టినరోజును పురస్కరించుకుని బెక్లెస్ ఎయిర్ ఫీల్డ్ (Beccles Airfield) లో సుమారు 6,900 అడుగుల ఎత్తులో స్కైడైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు యూకే(UK) లోనే అత్యంత వృద్ధ స్కైడైవర్ (Oldest Skydiver) గా రికార్డు (Record) సాధించారు.