హెలికాప్టర్​ ఢీకొని ఆ విమానంలోని 64 మంది మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో పెను విషాదం చోటుచేసుకుంది .   వాషింగ్టన్‌ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు భావిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రయాణికుల విమానం నుంచి 27 మంది మృతదేహాలు, హెలికాప్టర్​ నుంచి ఒకరి మృతదేహం ఇప్పటి వరకు వెలికి తీసినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ఉన్నారు. ఆ సైనిక హెలికాప్టర్‌ విమానం వెళ్లే మార్గంలోకి  ఎందుకు వచ్చిందో తెలియదని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ వ్యాఖ్యానించారు. ప్రమాదం కారణంగా విమానం మూడు ముక్కలై నదిలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు.