మిస్ యూనివర్శ్‌గా డెన్మార్క్ యువతి..

విక్టోరియాని వరించిన అందాల కిరీటం

డెన్మార్క్ అందాల పోటీలలో చరిత్ర సృష్టించింది. 73వ మిస్ యూనివర్శ్ 2024 పేజెంట్‌లో ఆ దేశానికి చెందిన 21 ఏళ్ల విక్టోరియా జాయిర్ (Victoria Kjaer)ని అందాల కిరీటం వరించింది. ఇప్పటివరకూ డెన్మార్క్‌కి ఇలాంటి కిరీటం దక్కడం మొదటిసారి . ఈ పోటీలలో మెక్సికోకి చెందిన మర్లా ఫెర్నాండా బెల్ట్రాన్ (Marla Fernanda Beltran) మొదటి రన్నరప్‌గా నిలవగా.. నైజీరియాకి చెందిన స్నిడిమ్మా అడెత్‌షిన్హా (Cnidimma Adetshina) రెండో రన్నరప్ పొజిషన్‌లో నిలిచింది. ఇండియా నుంచి ఈ పోటీల్లో నిలబడిన రియా సింఘా (Rhea Singha) టాప్ 12లో కూడా నిలబడలేకపోయింది. అంతకుముందు ఆమె ప్రిలిమినరీ రౌండ్స్‌లో మంచి పెర్ఫారెన్స్ ఇచ్చి, టాప్ 30లో నిలిచింది. కానీ.. ఫైనల్ రౌండ్ దాకా వెళ్లలేకపోయింది. స్విమ్ సూట్ పోటీ తర్వాత.. ఫైనల్ రౌండ్‌లో టాప్ 12 మంది పోటీ పడ్డారు. ఈవెనింగ్ గౌన్ రౌండ్‌ ఆసక్తిగా సాగింది. వీరిలో ఏడుగురు.. లాటిన్ అమెరికా దేశాల వారే ఉండటం గమనార్హం .

2022 లో జరిగిన అందాల పోటీలలో 19 ఏళ్ల వయసులో .. విక్టోరియా జాయిర్ (Victoria Kjaer) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలలో టాప్ 20 లో నిలిచి అప్పట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ.