అమెరికాలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నూతన డైరెక్టర్‌గా భారతీయుడు జై భట్టాచార్య- నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లు యూఎస్ మీడియాలో కథనాలు వచ్చాయి .
భారతీయ మేధావులకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు గుర్తిపు వస్తూనే ఉంది. అనేక కీలక స్థానాలలో భారత్ జాతీయులను నియమించడం ద్వారా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారన్న నమ్మకం వరల్డ్ వైడ్ బాగా వ్యాపించడింది .
అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నూతన డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక వాషింగ్టన్ పోస్టు కథనంలో పేర్కొంది. రేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉండగా, జై వైపు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలిపింది.
జై భట్టాచార్య స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజీషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. ట్రంప్ క్యాబినెట్లో ఆరోగ్య మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్ కెన్నడీని జై భట్టాచార్య గత వారమే కలిశారు. ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను కెన్నడీతో పంచుకున్నారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ అమెరికా బయోమెడికల్ రీసెర్చిని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఇది అమెరికా వైద్య విభాగం కింద పనిచేస్తుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో సంస్కరణలు తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే భట్టాచార్య సరికొత్త సృజనాత్మక అంశాలపై ఎన్‌ఐహెచ్ దృష్టి సారించాలని వాదిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆ సంస్థలో పాతుకుపోయిన వారి పట్టు తొలగించాలని చెబుతున్నారు.
కెన్నడీ సార్థ్యంలో హెచ్‌హెచ్‌ఎస్ ట్రంప్ కార్యవర్గానికి అత్యంత కీలకమైంది. ఇది అమెరికాలో వైద్య సేవలను చూసుకోవాల్సి బాధ్యత ఉంటుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజినింగ్ డైరెక్టర్‌గానూ జై భట్టాచార్య ఉన్నారు.