తాగునీరు మనిషి బతకడానికి ఎంతో ముఖ్యం. ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం. శరీరంలో ఎన్నో రకాల సమస్యలను మంచినీళ్లు దూరం చేస్తాయి. అందుకే కచ్చితంగా ప్రతీరోజూ కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. జీవక్రియ మెరుగ్గా ఉండాలన్నా, శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా లభించాలన్నా నీరు ఎంతో కీలకం. అయితే రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగొచ్చా అనే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి చాలా మందికి.
పడుకునే ముందు నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలలను తొలగిస్తాయి. రాత్రి నీరు తాగి పడుకోవడం వల్ల ఉదయం లేచే సరికి మూత్రం రూపంలో శరీరంలో తయారైన విష పదార్థాలు బయటకు పోతాయి. అదే విధంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కూడా మనం తాగిన నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి.
అలాగే మరో అద్బుతమైన ప్రయోజనం ఏమిటంటే రాత్రి తగినంత నీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే వారు రాత్రి పడుకునే ముందు నీరు తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మరింత మెరుగైన లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆ గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
రాత్రి పూట నీళ్లు తాగడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అయితే పదేపదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రకు భంగం కలిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర చక్రంలో అంతరాయం ఏర్పడడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. నిద్రపోయే కంటే కనీసం రెండు గంటల ముందు నీటిని తాగకూడదని, అయితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలని, నీరు మాత్రమే కాకుండా పడుకునే ముందు పండ్ల రసాలను తీసుకోవడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే అందరి శరీర ధర్మాలు ఒకేలా ఉండవు. ఏది పాటించినా ఎవరికివారు స్వయంగా అనుభవంలోకి తీసుకుని వచ్చిన ఫలితాలను బట్టి అనుసరించడమే మంచిది.