గుండెపోటుకు శీతాకాలం వ్యాయామంతో చెక్ పెట్టొచ్చా?

శీతాకాలం వచ్చిందంటే అందరం ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తాం. దుప్పటి లోనుంచి బయటకు రావాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ప్రతిరోజు వ్యాయామం చేసే వాళ్లుకూడా శీతాకాలంలో కొంచెం లేజీగా వ్యవహరిస్తారు. చలికాలం పోయాక చూద్దాంలే.. అనుకుంటారు. కాని శీతాకాలంలోనే శరీరం చురుకుగా ఉండాలి..లేక పోతే వివిధ రోగాల బారిన పడక తప్పదు అందున్నారు ఆరోగ్య నిపుణులు.

శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి బాగా ముదిరింది. ఇలాంటి వాతావరణంలో శారీరక చురుకుదనం గణనీయంగా తగ్గుతుంది. బాడీ చురుకుగా లేకపోతే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. 

చలికాలంలో రక్తనాళాలు సంకోచించడం హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని, ఫలితంగా గుండెపోటు, గుండె సంబంధిత ఇతర సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అవసరమైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. అందుకు వ్యాయామం చేయడం చాలా అవసరమని చెప్తున్నా


శీతాకాలంలో వ్యాయామం చేస్తే చాలా ప్రయోజనాలున్నాయి. బాడీలో ఉష్ణోగ్రతలు అవసరమైన మేరకు ఉంటాయి. చలికి బిగువైపోయే ఖండరాలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంతకన్నా ముఖ్యమైనది రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా గుండెపై తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.