Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం .. భయం భయంగా జనం . ..

దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 … Read more

Womens Entrepreneur : మహిళల వ్యాపారానికి సర్కార్ సాయం . .రూ. 5 కోట్లు

పురుషులతో అన్ని రంగాలలోనూ మన మహిళలు పోటీ పడుతున్నారు. ఇటీవల వ్యాపారాలలోను దూసుకుపోతున్నారు . మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి కేంద్ర సర్కార్ అనేక సహకారాలు అందిస్తోంది. రుణాలే కాకుండా సబ్సిడీ కూడా ఇవ్వడంతో మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్ కి భుజం తట్టినట్లనిపిస్తోంది . మహిళలకు బిజినెస్ హెల్ప్ అంటే . .. చిన్న చిన్న కుట్టుమిషన్లు , అప్పడాలు , వడియాల తయారీలకే కాదు . .. మార్కెట్ లో ఎదుగుదలకు ఛాన్స్ ఉన్న (నైతికంగా … Read more

ఢిల్లీ కాలుష్యం..స్టేజ్-4 ఆంక్షలు

రోజురోజుకీ వేగంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది .  దేశ రాజధాని నగరం దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంపై ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ, తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ -4’ (GRAP-IV) కింద మరిన్ని … Read more

హైపర్ సోనిక్ సక్సెస్

భారత్ అంబుల పొడిలో మరో రామబాణం వచ్చి చేరింది . ”ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి, లాంగ్ రేంజ్ హైపర్‌సోని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది” అని రక్షణ మంత్రి X ద్వారా తెలిపారు . “ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ ముఖ్యమైన విజయం. అలాంటి క్లిష్టమైన, అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న, దేశాల సమూహంలో మన దేశం కూడా చేరింది” … Read more

Narendra Modi: నైజీరియా చేరుకున్న మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకు చేరుకున్నారు. నైజీరియాలో మోదీ పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని రాక నేపథ్యంలో అక్కడ సందడి నెలకొంది. నైజీరియాలో నివసిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో అబుజా ఎయిర్ పోర్టుకు చేరుకుని మోదీకి ఆహ్వానం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. వారికి కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. మరోవైపు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ఇంత ఆత్మీయంగా, ఉత్సాహభరితంగా … Read more

Google AI: హోంవర్క్ కోసం ప్రశ్నిస్తే చచ్చిపొమ్మని చెప్పిన గూగుల్ ఏఐ..

ఏమి రా? బాలరాజు నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం అన్న మాట పూరీ జగన్నాథ్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. గూగల్ ఏఐ కూడా ఒక వ్యక్తికి ఇదే డైలాగ్ చెప్పింది. హోంవర్క్ కోసమని గూగుల్ ఛాట్ బోట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది. తన హోంవర్క్ కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా ‘నువ్వు భూమికి బరువు.. ప్లీజ్ నువ్వు చచ్చిపో ప్లీజ్’ అంటూ గూగుల్ ఛాట్ బోట్ జవాబిచ్చింది. … Read more

Sanju Samson: క్రికెట్లో సంజూ శాంసన్.. సంచలన రికార్డు..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో ఇద్దరికీ ఇవి రెండవ సెంచరీలు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ … Read more

Uttar Pradesh: అగ్నికి ఆహుతైన 10 మంది చిన్నారులు.. యూపీలో దారుణం

ఆస్పత్రులో అగ్ని ప్రమాదాలు, చిన్నారుల దారుణ మరణాలకు ఉత్రరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకు వరుసగా ఈ ఘోరాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శుక్రవారం రాత్రి మరో విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ నగరంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఎన్ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. … Read more

RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన

దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు, ప్రముఖులు వారి వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంక్‌లలో డిపాజిట్ లేదా ఎక్చేంజ్ చేసుకున్నారు. అక్టోబర్ 7, 2023 వరకూ అన్ని బ్యాంకు బ్రాంచ్‌ల్లో రూ.2వేల నోట్లను … Read more