హిందూనగారా .. హైందవ శంఖారావం

   హిందూ దేవాలయాలకు   స్వయంప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ తో విశ్వ హిందూ పరిషత్ . . దేశవ్యాప్త ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుడుతోంది.. 

  కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా హిందువులందరినీ  ఏకతాటిపైకి తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమానికి జనవరి 5 న నాంది పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ”హైందవ శంఖారావం ‘ భారీ ఏర్పాట్లు చేశారు .   

 ‘జై శ్రీరామ్’ నినాదంతో అయోధ్య ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో హిందూ జనాన్ని కదిలించి.. రామమందిరాన్ని సాధించాం.. మరోమారు అంతటి స్పూర్తితో ఆలయాల నిర్వహణను హిందూ సమాజాలకు అప్పగించాలనే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం.. అని విశ్వహిందూ పరిషత్ ఏపీ విభాగ ప్రతినిధి ఒకరు చెప్పారు. 

   దేవాలయాలను హిందూ సమాజమే స్వతంత్రంగా నిర్వహించుకున్నపుడు హిందువుల ఆలయాలు, ధార్మిక విశ్వాసాలు, పవిత్రత కాపాడబడతాయని విశ్వసిస్తున్న  విహెచ్ పి ఈ మేరకు హిందువుల హక్కులను సాధించుకునేందుకు కార్యాచరణకు పునాదివేస్తున్నారు.  

‘’హైందవ శంఖారావం’’ పేరుతో 2025, జనవరి 5 న  .. గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసనపల్లిలో  నిర్వహించతలపెట్టిన ఈ మహాసభకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి 3 లక్షల మంది హిందూ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.  

      ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అజమాయిషీలో పనిచేయాలి. అలాగే పాలకుల చెప్పుచేతలలో ఉండే పాలక మండళ్ల పెత్తనం కూడా ఉంటుంది. వీటి వల్ల రాజకీయ ప్రమేయంతో పాటు, సంప్రదాయాలు సక్రమంగా అమలు కావడంలేదన్నది హిందూ పెద్దల విమర్శ.  ఎండోమెంట్ పెత్తనం తీసివేయడం వల్ల ఆయా హిందూ సంఘాల నిర్వహణలోకి వస్తాయ్. దీనివల్ల ముందుగా..  హైందవేతరుల నియామకానికి   దేవాలయాలలో బ్రేక్ పడుతుందని VHP భావిస్తోంది .

    VHP జనరల్ సెక్రటరి డిమాండ్స్ ఇవే . .

 విశ్వహిందూ పరిషత్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాండే మీడియాతో మాట్లాడారు. హిందూ సమాజం పట్ల వివక్ష చూపుతున్నందున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాల నియంత్రణ, నిర్వహణ, రోజువారీ పనుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.  

  సాధు సమాజం మరియు హిందూ సమాజంలోని ప్రముఖుల నాయకత్వంలో, జనవరి 5, 2025 నుండి ఈ విషయంలో దేశవ్యాప్త ప్రజా చైతన్య ప్రచారాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.   ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ‘హైందవ శంఖారావం’ పేరుతో లక్షలాది మంది భారీ సభను నిర్వహించనున్నామని తెలిపారు.భారత రాజ్యాంగంలోని 12, 25 మరియు 26 అధికరణలను విస్మరించారు! ఏ మసీదు లేదా చర్చి వారి ఆధీనంలో లేనప్పుడు, హిందువులపై ఈ వివక్ష ఎందుకు? అనేక గౌరవనీయమైన హైకోర్టులు మరియు గౌరవనీయమైన సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వాలు దేవాలయాల నిర్వహణ మరియు ఆస్తులను ఆక్రమించాయని చెప్పారు.

 ఆంధ్రప్రదేశ్ నుంచే ఎందుకు?   

    హిందూ దేవాలయాల నిర్వహణ ‘హిందూ సమాజాలకు’ అ ప్పగించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో NDA కేంద్రంలో అధికారంలో ఉన్నా.. తమ హక్కుల కోసం వీహెచ్ పీ ‘హైందవ శంఖారావం’ ఉద్యమం అవసరం ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బీజేపీ అంటేనే.. వీహెచ్ పి , ఆర్ ఎస్ ఎస్ వంటి హిందూ సంస్థల అజమాయిషీలో ఉంటుందనే నానుడు ముందునుంచీ ఉంది. 

       ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏమంత ప్రభావవంగమైన పార్టీగా లేదు. టీడీపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఏర్పడి.. ఇక్కడ 8 అసెంబ్లీ, 4 లోక్ సభ సీట్లు గెలుపొందింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి 2 శాతం లోపే ఓట్లు ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉండటం, బలమైన రాజకీయ శక్తిగా ఉండటం వంటి కారణాలతో టీడీపీ, జనసేన ఇక్కడ బీజేపీతో జట్టుకట్టాల్సిన పరిస్థితి ఉంది. 

     

  • ‘హైందవ శంఖారావం’ డిమాండ్లు.. 
  • రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్స్ ప్రకారం.. హిందూ ఆలయాలను ఆయా సంస్థలకు అప్పగించాలి.
  • హిందూ ఆలయాలను ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించి.. స్వయంప్రతిపత్తి కల్పించాలి. 
  • ఆలయాలలో హైందవేతరులను తక్షణం తొలగించాలి.  
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం హిందువులే ఉండాలి. 
  • దేవాలయాల పరిసరాలలో ఉండే దుకాణాలు హిందువులకే కేటాయించాలి. 
  • అన్యాక్రాంతం అయిన దేవాలయాల ఆస్తులను స్వాధీనం చేసుకునే పటిష్ట చర్యలు చేపట్టాలి.  
  •  
  • దేవాలయాల ఆస్తులు, ఆదాయాల విషయంలో సర్కార్ జోక్యం ఉండకూడదు. 
  • రాజకీయ పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ ఆలయాల సంప్రదాయాలలో జోక్యం చేసుకోకూడదు. 
  • దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ధర్మప్రచారానికి, సేవకు మాత్రమే వినియోగించాలి. 
  • హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. 
  • దేవాలయ ట్రస్టు బోర్డులో రాజకీయ ప్రమేయంలేని హిందూ పరిరక్షకులకు నియమించాలి. 
  • ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలకు ఆదాయం చాలా ఎక్కువ. ప్రధాన టెంపుల్స్ అయిన తిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి, సింహాచలం నరసింహస్వామి.. ఇలా పేరొందిన ఆలయాల ఆదాయం భారీగా ఉంటోంది. 
  • ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో దేవాలయాలకు ఆదాయం ఎక్కువ. నిర్వహణ కూడా సమస్య ఉండదు. అయితే ఉత్తరాది రాష్ట్రాలలో ఆలయాలకు స్వయంప్రతిపత్తి కలిపిస్తే.. వాటి నిర్వహణ భారమయ్యే అవకాశం కూడా ఉంటుందన్న అంశంపై ఉద్యమకారులు ప్రత్యామ్న్యాయ ఆదాయ మార్గాలు చూడాలి. 
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం కింద 33,871 దేవాలయాలు నమోదయ్యాయి. వీటిలో 25,000 దేవాలయాలకు ఆదాయం వచ్చేలా లీజుకు ఇచ్చే భూమి లేదు.నిత్య ఆదాయం కూడా నిర్వహణకు సరిపోదు. 
  • సుమారు..  32,000 దేవాలయాలు ఒక్కొక్కటి రూ. 50,000 కంటే తక్కువ వార్షికాదాయం కలిగి ఉన్నాయి.  
  •  ఇలాంటి అంశాలను కూడా ఉద్యమకారులు పరిశీలనలోకి తీసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషించి నిర్వహణ సజావుగా సాగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి.

 -.స్వామీజీలు , మాతాజీలు , కేంద్రీయ సంఘటన ప్రతినిధులు , రామజన్మ ట్రస్ట్ గోవింద్ గురుదేవ మహారాజ్ ఈ సభలో పాల్గొంటున్నారు .

– ఈ సభలో దేవాలయాలలో అన్యమత ఉద్యోగుల తొలగింపు , వ్యాపార ధోరణిని విడనాడట వంటి ప్రధాన  డిమాండ్లు ఉన్నాయి .

– హిందూ సమాజంపై జరుగుతున్న దాడులు , ఆలయాలపైనా , హిందూ సంప్రదాయాలపైనా జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కొవాలనేదానిపై కూడా సభలో వక్తలు సూచిస్తారు .

– రాజకీయ ప్రమేయంతో హిందువులపై దాడులు జరగడం , బాధితులైన హిందువులపైనే కేసులు పెట్టడం పైనా చర్చ ఉంటుందని ప్రతినిధులు చెపుతున్నారు.