సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ నిజమే . . పవన్ ముందే చెప్పారు . .

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి గతంలో కారుచౌకగా కట్టబెట్టిన భూములలో అసైన్డ్ ల్యాన్డ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరస్వతి కి కేటాయించిన భూములలో అవకతవకలతోపాటు . . అసైన్డ్ భూములు ఉన్నాయని ఏపీ డిప్ట్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వస్తున్నారు .

సరస్వతి పవర్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా తాజా సర్వేలో ప్రభుత్వం గుర్తించింది. ఇరవై ఎకరాల మేర దళితులు ఇచ్చిన భూముల్ని అక్రమంగా జగన్ రెడ్డి బినామీలు కొనుగోలు చేశారు. తర్వాత వారు సరస్వతి పవర్‌కు అమ్మినట్లుగా చట్టవిరుద్దగా పత్రాలు సృష్టించారు. ఈ వ్యవహారం విచారణలో వెలుగు చూడటంతో సదరు భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది .

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ ను అమ్మడానికి వీల్లేదు. అలా అమ్మితే వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సరస్వతి భూముల్లో అసైన్డ్ భూముల్ని మొదట కడపకు చెందిన వ్యక్తులు ఈ దళిత లబ్దిదారుల నుంచి కొనుగోలు చేశారు. బెదిరించి కొని ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు సరస్వతి పవర్‌కు భూములు అప్పగించారు. ఇప్పుడు వీటన్నిటినీ స్వాధీనం చేసుకుంటారు.