సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డ్..

  • పార్టీ సభ్యత్వాలలో 73 లక్షలకు చేరిన సంఖ్య
  • టాప్ -5 లో నెల్లూరు, రాజంపేట, పాలకొల్లు, మంగళగిరి, కుప్పం
  • పార్టీ శ్రేణులకు చంద్రబాబు అభినందనలు

సభ్యత్వ నమోదులో టీడీపీ నయా రికార్డ్ సాధించిందని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సభ్యత్వాల సంఖ్య 73 లక్షలకు చేరిందని తెలిపారు. టాప్ -5 లో నెల్లూరు, రాజంపేట, పాలకొల్లు, మంగళగిరి, కుప్పం ఉన్నాయన్న ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలను అభినందించారు. కొత్త సభ్యత్వాలతో పాటు యువత, మహిళల సభ్యత్వాలు నమోదు అయ్యాయని చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేసే వారే పాలిటిక్స్ లో రాణిస్తారని తెలిపారు. పని తీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందన్న ఆయన కష్టపడనిదే ఏదీ రాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. పార్టీ వలనే ఏ పదవైనా అనే విషయాన్ని గ్రహించాలన్నారు. కొందరు పదవులు వచ్చాక పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే సరిపోదని స్పష్టం చేశారు.