జనవరి 8 న మోదీ విశాఖ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 7 న విశాఖలో పర్యటించనున్నారు . ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్‌కళాశాల మైదానానికి చేరుకుంటారు.

ఎన్టీపీసీ (NTPC) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్‌ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఇప్పటికే సభాస్థలంలో పనులు ప్రారంభించారు.

సీఎం చంద్రబాబు రాక : సీఎం చంద్రబాబు ఈ నెల 4న విశాఖ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని ఆర్కేబీచ్‌లో తూర్పు నౌకాదళం విన్యాసాలు తిలకిస్తారు. సాయంత్రం 6.45 గంటలకు నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. అదే రోజు విమానంలో విజయవాడకు తిరుగు పయనమవుతారు.

ఈ సందర్బంగా ప్రధాని సభ ఏర్పాట్లపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు .