ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎందుకు వెళ్లిపోతున్నారు ?

”ఆంధ్రజ్యోతి పత్రికలో 2008 నుంచీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె శ్రీనివాస్ తప్పుకుంటున్నారా ?  అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. నవంబర్ 1 నుంచి శ్రీనివాస్ తప్పుకుంటున్నట్లు చెపుతున్నారు .  గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసిన ,  తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలసి డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయడానికే కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతిని వీడుతున్నట్లు చెపుతున్నారు .

ఎడిటర్ శ్రీనివాస్ రాజీనామా చేస్తే అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న వక్కలంక రమణకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో ప్రచారం సాగింది .  వక్కలంక రమణ జర్నలిజం లో నిజాయితీపరుడిగా గుర్తింపు పొందారు . పని విషయంలోనూ ,  క్రియేటివిటీలోను వక్కలంక వెళ్లల్లో లెక్కపెట్టవలసిన జర్నలిస్ట్ .   అయితే కొందరు అవినీతిపరులు , జర్నలిజంలో  చెడ్డ పేరున్న   వారిని  ఆంధ్రజ్యోతిలో ఉద్యోగాలు ఇప్పించడం ,  ఇక్కడకు వచ్చిన తరువాత టాలెంట్ లేనివారిని సైతం  ప్రోత్సహించారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు .  ఈ కారణంగానే రమణకు ఎడిటర్ ఛాన్స్ మిస్సయినట్లు చెప్పుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కు కె శ్రీనివాస్ అత్యంత నమ్మకమైన ఎడిటర్ గా రెండు దశాబ్దాలుగా పనిచేసారు . 

రాహుల్ కి ఎడిటర్ బాధ్యతలు :  ఆంధ్రజ్యోతిలో కొన్నాళ్ల క్రితం చేరిన నాదెళ్ల రాహుల్ కుమార్ అనే జర్నలిస్ట్ కి ఆంధ్రజ్యోతి ఎడిటర్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి సంస్థలో ప్రచారం సాగుతోంది .  రాహుల్ ,  వక్కలంక రమణ గతంలో ఈనాడులో కలిసే పనిచేసారు .  అక్కడ రాహుల్ తో  ఇమడలేక వక్కలంక రమణ ఆంధ్రజ్యోతికి వచ్చారు .  మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఎవరితో అయితే ఇమడలేక ఈనాడును వదిలిపెట్టి వచ్చేసారో . .  వారితోనే పనిచేయాల్సి రావడం యాదృచ్చికమా ?  కర్మ ఫలమా ?  అంటూ ఆంధ్రజ్యోతిలోనే జర్నలిస్టులు వ్యంగంగా వ్యాఖ్యనిస్తున్నారు . అయితే రమణతో పోలిస్తే రాహుల్ కి  సమర్థత అంతగా లేదని జర్నలిస్ట్ వర్గాలలో చర్చ నడుస్తోంది .  అయినా ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఏమి చూసి రాహుల్ కి కీలకమైన ఎడిటర్ బాధ్యతలు అప్పగిస్తుందో వారికే తెలియాలి .