1. డ్రోన్లను ఉపయోగించి అతి పెద్ద భూగోళం ఆకృతి
2. అతి పెద్ద ల్యాండ్ మార్క్
3. అతి పెద్ద విమానం
4. అతి పెద్ద జాతీయ జెండా
5. ఏరియల్ లోగో
ఈ ఐదు అంశాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది విజయవాడలో టీడీపీ సర్కార్ నిర్వహించిన డ్రోన్ షో.
లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట డ్రోన్ షో మొదటి రికార్డు సాధించగా, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టించటం పేరిట రెండో రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డు నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో గిన్నీస్ రికార్డు సాధించింది. ఏరియల్ లోగోతో డ్రోన్ షో అయిదో రికార్డు అందుకుంది. 5 గిన్నిస్ రికార్డుల్లో పోటీపడిన అమరావతి డ్రోన్ ప్రదర్శన ప్రపంచ చరిత్ర సృష్టించింది.
కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో గ్రాండ్ సక్సెస్ అయింది . డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు . . ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంతో పాటు అరుదైన ఐదు రికార్డులను నెలకొల్పడం గమనార్హం .ఈ షో లో 5,500 డ్రోన్ల ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు . ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేయడం ద్వారా విజయవాడ డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి సర్టిఫికెట్లు అందజేశారు.