తాడేపల్లి: తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateswara Swamy) దర్శనం రద్దు చేసుకున్న ఏపీ మాజీ సీయం జగన్ (AP Ex CM YS Jagan), అనంతరం మీడియాతో (Media) మాట్లాడారు. తిరుమల పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలను జగన్ వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తుంది, దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోనే ఎక్కడా జరిగి ఉండవు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయ చరిత్రలో ఎక్కడా ఉండవని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి(YCP) నేతలకు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని అన్నారు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదు రావద్దని నోటీసులు(Notices) ఇచ్చారని, మాజీ సీఎం అయినా నాకు దేవుడిని దర్శనానికి అనుమతి లేకపోవడం ఏంటి..? అని ప్రశ్నించారు.
పేరు ప్రతిష్టతలను, లడ్డూ విశిష్టతను దెబ్బతీసే పని..
చుట్టుపక్కల రాష్ట్రాల (States) నుండి బీజేపీ (BJP) వాళ్ళని రప్పిస్తున్నారని, బీజేపీ హై కమాండ్ కి ఇక్కడ జరుగుతుంది అంతా తెలుసో తెలీదో.. తిరుమల లడ్డూ (Tirumala Swami Vaari Laddu)విషయంలో చంద్రబాబు (Chandrababu Naidu) చెప్పినవి అబద్దాలు అని ఒక్కొక్కటి రుజువు అవుతున్నాయని అన్నారు. చేసిన తప్పును డైవర్ట్ చెయ్యడానికి డిక్లరేషన్ (Declaration) టాపిక్ తీసుకుని వచ్చారని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితో ఇలాంటి అసత్య ప్రచారాలు (Fake Publicity) చేస్తున్నారని మండిపడ్డారు. స్వామివారి పేరు ప్రతిష్టతలను, లడ్డూ విశిష్టతను దెబ్బతీసే పని సాక్షాత్తు ముఖ్యమంత్రి(AP CM) చేయడం దారుణమని అన్నారు.
చిన్నప్పటి నుంచి నాకు లడ్డు విశిష్టత తెలుసు:
నా చిన్నప్పటి నుంచి నాకు లడ్డు విశిష్టత తెలుసని, లడ్డూ టేస్ట్, స్మెల్ కి అంత విశిష్టత ఉందన్నారు. దశాబ్దాలుగా లడ్డూ తయారీ ఒకే రకంగా జరుగుతుందని, టీటీడీ టెండర్ల లో (TTD Tenders) ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదన్నారు. ఆరు నెలలకోసారి టెండర్ల పక్రియ రెగ్యులర్ గా జరుగుతూనే ఉందని, తప్పు చేసే ఆలోచన కూడా లేని వ్యక్తులే టీటీడీ బోర్డులో (TTD Board) ఉంటున్నారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి ఉన్న వ్యక్తులే బోర్డులో ఉంటారని, టీటీడీ బోర్డులో తప్పు అనేది జరగదని, అలాంటి నియమ నిబంధనలు (Rules & Regulations) దశాబ్దాలుగా అమలు అవుతున్నాయి.. తప్పు చేసే అవకాశం ఏమాత్రం లేని ప్రాక్టీస్ తిరుమలలో ఉందన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప ప్రక్రియ టీటీడీలో..
ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప ప్రక్రియ తిరుమలలో ఉందని, వచ్చిన ప్రతీ నెయ్యి ట్యాంకర్‌కు (Ghee Tanker) తిరుపతిలో మూడు టెస్టులు చేస్తారని, 2014-19 చంద్రబాబు హయాంలో 14 నుంచి 15 సార్లు ఇలానే ట్యాంకర్లు వెనక్కి పంపారని జగన్ గుర్తు చేశారు. మా హయంలో 18 సార్లు వెనక్కి పంపామని, ఈసారి రిజెక్ట్ అయిన కంపెనీ సప్లై జూన్ 12 నుండే కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలు అయ్యిందన్నారు. టీటీడీ చరిత్రలో మొదటిసారి గుజరాత్ (Gujarat) లోని NDDB ల్యాబ్‌కి పంపారని, రిజెక్ట్ అయిన ట్యాంకర్ లు వెనక్కి పంపి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు.
రెండు నెలల తర్వాత బయటకు ఎందుకు..?
వాడని నెయ్యిని వాడినట్లు 2 నెలల తరువాత ఎందుకు బయటకు తీసుకువచ్చారని జగన్ ప్రశ్నించారు. ఆ నెయ్యి వాడలేదు అని జూలై 23 తేదిన ఈవో (TTD EO) ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ రిజెక్ట్ అయిన నెయ్యి వాడలేదని ఇచ్చారని, చంద్రబాబు మాత్రం జంతువుల ఫ్యాట్ కలిసిందని, భక్తులు తిన్నారని అసత్యాలు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ నుండి వచ్చిన NDDB రహస్య రిపోర్ట్ టీటీడీ కార్యాలయంలో(TTD Office) విడుదల చేశారని, ఆ ట్యాంకర్లు వాడలేదని ఈవో చెప్తుంటే.. వాడేశారని చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు.
2015 నుండి 2018 వరకూ చంద్రబాబు హయాంలో నందిని బ్రాండ్ ఎందుకు లేదు?
2015 నుండి 2018 వరకూ చంద్రబాబు హయాంలో నందిని బ్రాండ్ (Nandini Brand) ఎందుకు లేదని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో ఏ రేటుకి కొన్నారో 2019 చివరిలో కూడా రూ.300 లోపే నెయ్యి కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. హెరిటేజ్ (Heritage Company) నెయ్యి రేట్లు పెంపు కోసం ఎక్కువ రేటు అని మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వైఎస్ఆర్, జగన్ కొత్తనా.. నా మతం, నా కులం ఏంటి అనేది ప్రజలకు తెలియదా..? వైఎస్ఆర్ అనేక సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.. నా పాదయాత్ర మొదలెట్టినప్పుడు శ్రీవారిని దర్శించుకుని మొదలుపెట్టా.. పాదయాత్ర ముగిశాక నేరుగా కాలినడకన కొండ ఎక్కి దర్శనం చేసుకున్నా.. నేను సీఎం అయ్యాక ఐదేళ్లు నేనే భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు సమర్పించాను.. నేనేదో మొదటిసారి వెళ్తున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలని డైవర్షన్ (Diversion) చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
నా మతం మానవత్వం.. వెళ్లి డిక్లరేషన్ లో రాసుకోండి..
లడ్డూ వ్యవహారంలో నిజాలు బయటకి రావడంతో ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగు గోడల మధ్యే నా మతం ఫాలో అవుతా.. బైబుల్ (Bible) చదువుతా.. గోడ దాటి బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తా.. నా మతం మానవత్వం (Humanity).. వెళ్లి డిక్లరేషన్ లో రాసుకోండి.. సెక్యులర్ దేశం (Secular Country) అని చెప్పుకుంటేనే గుడికి పోవడానికి నీ మతం ఏంటి అని అడుగుతున్నారు.. మతం (Religion) పేరుతో రాజకీయాలు చెయ్యడం చాలా దౌర్భాగ్యం.. హిందూ మతానికి రిప్రజెంటేషన్ (Representation) అని చెప్పుకునే బిజెపి తిరుమల అపవిత్రం చేసిన చంద్రబాబునీ ఎందుకు వెనకేసుకుని వస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.