ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్ ) పరీక్షలకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది . . అక్టోబరు 3 నుంచి 21 వరకు రాష్ట్రంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది . దసరా నేపథ్యంలో, అక్టోబరు 11, 12 తేదీల్లో మినహా మిగతా తేదీల్లో టెట్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. సెప్టెంబరు 22 నుంచి టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తున్నట్టు పేర్కొంది.