చంద్రబాబునే మార్చేస్తాం . … టీడీపీ సోషల్ మీడియా ఎటాక్ . .

”పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే మార్చిన పార్టీ. NTR బతికుండగానే పక్కదారులు పట్టి పార్టీని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకువెళ్ళినపుడు ఆ మహనీయుడినే తప్పించాం . రూటు మారుతుంటే చంద్రబాబు నైనా మార్చేస్తాం . . అతనో లెక్కా .  పార్టీని రక్షించుకోవాలంటే ఏదైనా చేస్తాం . .’ అంటూ టీడీపీ హార్డ్ కోర్ సోషల్ మీడియా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆగ్రహోదగ్రులవుతున్నారు .  ముక్యంగా NRI వింగ్ మరీ దాడి ఉదృతం చేస్తున్నారు .

ఫైబర్ నెట్ చైర్మన్ ,  టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి వ్యవహారంలో చంద్రబాబును మెజార్టీ నేతలు ,  కేడర్ తప్పుపడుతున్నారు .  చాతకానివాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు .  ఐఏఎస్ అధికారులు ఏకమై… ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కి మద్దతుగా నిలబడటంతో .. అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సీఎం వెనుకంజ వేశారు .  వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కి నిబంధలకు విరుద్దంగా జీతం రూపంలో సొమ్ము చెల్లించారు .  దీనిపై ఏపీ సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి ఆత్మాభిమానమ్ దెబ్బ తిని . . పార్టీకి ,  తనకు ఉన్న పదవికి రాజీనామా చేశారు .  ఈ వ్యవహారంలో పార్టీ హార్డ్ కొర్ కేడర్ ,  నైతికంగా పేరున్న నేతలు జీవి రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు .  ఈ వ్యవహారం టీడీపీలో ముదిరిపాకాన పడుతోంది .