Swaroopanandendra Saraswati: సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి.. రిషికేశ్ లో తపస్సు చేసుకుంటా.. : స్వరూపానందేంద్ర స్వామి

విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను రిషికేశ్ లో తపస్సులో ఎక్కువ సమయం గడుపుతానని చెప్పారు. తనకు ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను వెనక్కి తీసుకోవాలని కోరారు. తన గన్ మెన్లను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్ కు శారదాపీఠం తరపున లేఖ రాశారు. తన భద్రత కోసం 2019 నుంచి 2024 వరకు మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాలు పోలీసు రక్షణ కల్పించాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.