జగన్ రాయబేరం నిజమేనా ? రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో, మాజీ సీఎం ,  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంధికి సిద్దమవుతున్నారా ?  దీనిపై ఈ రోజు ఆంధ్రజ్యోతి సంచలన కధనం పబ్లిష్ చేసింది .  దీనిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జోరుగా చర్చ నడుస్తోంది .

గతంలో షర్మిల పార్టీ పెడుతుందని ,  జగన్ తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కి దూరంగా ఉంటుందని ,  వైసీపీ కి ప్రచారం చేయబోరనికూడా ఆంధ్రజ్యోతి ,  ABN మీడియా మాత్రమే బ్రేక్ చేసింది .  దీంతో ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసిన కధనంపై కూడా ఏపీలో రాజకీయ విశ్లేషకులు ఇది నిజమే . . అంటూ విశ్లేషణలు చేస్తున్నారు .  జగన్ పెయిడ్ మీడియా మాత్రం ఈ వార్తను ఎప్పటి మాదిరిగా ఖండిస్తూనే ఉంది .

గతంలో ఆంధ్రజ్యోతి రాసినవి జరిగాయని . . దీనిని నమ్మడం కాదు .  నిజంగా జగన్ కాంగ్రెస్ లో తన వైసీపీ ని కలపాలంటే షర్మిల అవసరం ఏముంటుంది ?  డైరక్టగా జగనే రాహుల్ గాంధీతో మాట్లాడుకోవచ్చు కదా

రాహుల్ ని ఒప్పించలేనన్న అపనమ్మకం జగన్ ని వెంటాడుతోందా ?  జగన్ అవినీతిపరుడని … ఆ పార్టీని కాంగ్రెస్ లో కలుపుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి ఆ మచ్చ అంటుకుంటుంది రాహుల్ భయపడే ప్రమాదం ఉందా ?  షర్మిల అయితే ఏదోలా ఒప్పించగలదని జగన్ నమ్ముతున్నారా ?  దీనిపై ఆంధ్రప్రదేస్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది .