Samantha: రెండో పెళ్లిపై స‌మంత షాకింగ్ కామెంట్స్‌

స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోను వారి జంటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. విడిపోతున్నారనే వార్తలు మొదలైన నాటి నుంచి తెలుగు మీడియాలో బాగా సంచలనం అయ్యారు. ప్రతి రోజు వారిపై ఏదో రూమర్ బయటకు వస్తూండేది. విడిపోయిన తర్వాత మరింత ఆసక్తి కరంగా మారారు. వారు ఏమి మాట్లాడినా, స్పందించినా సంచలనంగా మారుతూ వస్తోంది. అయితే తాజా సమంతా విడాకుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఇక ప్ర‌స్తుతం స‌మంత మ‌ళ్లీ న‌ట‌న‌లో బిజీ అయ్యారు. ఆమె న‌టించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హ‌నీ బ‌న్నీ’ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. దాంతో ఆమె వ‌రుస‌గా ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాజాగా స‌మంత ఒక ఇంట‌ర్వ్యూలో  మాట్లాడుతూ ఆమె త‌న రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. “నేను ప్రేమించి, ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. నాకు మ‌రో వ్య‌క్తి అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం హ్యాపీగానే ఉన్నా” అని ఆమె చెప్పింది.