Nitin Gadkari: రూ.400 కోట్లతో 12రోడ్ల అభివృద్ధి

ఏపీలో పలు రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు.   ఎక్స్ వేదికగా ఆయన కొన్ని వివరాలు తెలిపారు.  200.06 కిలో మీటర్ల పొడవైన 12 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) నుండి ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

గుంటూరు – నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని నాలుగు వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అవసరాల గురించి చర్చించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కలిసి వచ్చిన కొన్ని రోజుల్లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుండి ఈ ప్రకటన వెలువడింది.