” పామాయిల్.. ఎసిడిక్ యాసిడ్ , లిక్విడ్ గ్లూకోస్ . . ఇవీ కృత్రిమ పాలు తయారీకి ”మిల్క్ మాఫియా ‘ వాడుతున్న పదార్థాలు . పాల లాంటి వాసన కోసం ఇందులో కొంచెం పాలపొడి . . అంతే వందలు , వేల లీటర్ల పాల తయారీకి తెగబడుతున్నారు కల్తీ దారులు . ”
ముక్కుపచ్చలారని చిన్నారులకు ఈ పాలు పట్టిస్తే.. కల్తీ మాఫియా వాళ్ళు ఇది ఒక్కసారి ఆలోచిస్తే . . ఆ పాపం ఎంత గట్టిగా తగులుతుందో అని ఆత్మ పరిశీలన చేసుకుంటే పాల కల్తీకి ఒడికడతారా ? ?
కారంలో రంపపు పొట్టు – టీ పొడిలో చింతపిక్కల పొడి – కంది పప్పులో కేసరి పప్పు . , నెయ్యిలో డాల్డా . , సెనగ పిండిలో కాస్త కలర్ , బియ్యంపిండి . . ఇలా ఆహార పదార్థాలు కల్తీ గురించి కొంత వరకు మనము విన్నాము . పాలలో పాలపొడి వేసి కల్తీ చేస్తారని చెప్పుకోవడం కూడా మనకు తెలుసు . అయితే . . ప్రమాదకర రసాయనాలు , పామాయిల్ వంటి వాటితో ఏకంగా పాలనే తయారు చేసే మాఫియా గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం పెద్దగా పట్టించుకోవడంలేదనే చెప్పాలి .
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఈ కెమికల్ మిల్క్ మాఫియా రెచ్చిపోతోంది . అయినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది . తెలంగాణలో హైదరాబాడ్ లో సైతం కెమికల్ మిల్క్ మాఫియా విస్తరిస్తోంది .
చంటి పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నారు. ఎంత దారుణమంటే ఆ పాలను ప్రమాదకరమైన యాసిడ్స్‌తో తయారు చేసి బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.తాజాగా.. హైదరాబాద్ శివారు పీర్జాదిగూడలో ఓ నకిలీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఆ కేంద్రంలో చాలా కాలంగా నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకర ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్ లిక్విడ్, చిరోటి రవ్వ, పామాయిల్, వనస్పతి, వాసన కోసం కొంచెం పాల పొడి వాడి పాలు తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. ఒక కేంద్రంలోనే రోజుకు 5 వేల లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గజేందర్‌సింగ్ అనే పాల వ్యాపారి కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల పేరుతో పాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్ల, టీ స్టాళ్లకు ఈ పాల ప్యాకెట్లు, వెన్న, పెరుగు, ఐస్‌క్రీం వంటివి సైతం తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్రముఖ డెయిరీల పాల ఉత్పత్తుల ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ఈ పాల ప్యాకెట్లు దొరుకుతుండటంతో చాలా మంది వీధి వ్యాపారులు, హోటళ్ల యజమానులు, కొందరు వినియోగదారులు వీటి వైపు మెుగ్గు చూపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్రాండెడ్ కంపెనీల పాల కన్నా.. చిక్కగా ఉంటాయని, వెన్న శాతం ఎక్కువగా ఉంటుందని.. నకిలీ పాలను హోటళ్లకు, వినియోగదారులకు విక్రయిస్తున్నారు. శ్రీకృష్ణ, కోహినూర్ బ్రాండ్ల పేరుతో తయారు చేసిన పాలు, వాటి అనుబంధ ఉత్పత్తులను నగరంలోని దాదాపు 50 హోటళ్లకు, పలు స్వీట్ హౌస్‌లకు విక్రయించినట్లు ఎస్‌వోటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఆయా నకిలీ పాల ప్యాకెట్లపై స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా లోగోలను సైతం ముద్రించినట్లు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలు, రాజధాని సమీపంలోని పలు జిల్లాల్లోనూ ఈ తరహా పాలు తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ పాలను తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారులు ద్రుష్టి సారించి నకిలీ పాల తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు .