ఔను . . లోకేష్ టార్గెట్ లక్ష కోట్లు . మీరు విన్నది నిజమే … తాను నిర్వహించే శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పనకు తీసుకురావాలనుకుంటున్న పెట్టుబడులు .
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీకి ప్రఖ్యాత కంపెనీలను స్వాగతించాలన్నది లోకేష్ సంకల్పం.
యువగళం పాదయాత్రలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఏపీ ఐటి , ఎలక్ట్రానిక్స్ , మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేసారు . ఇందులో భాగంగా విశాఖపట్నం , అమరావతి , తిరుపతి నగరాలకు పెద్ద ఎత్తున ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీలను తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు . విశాఖలో రెండు దఫాలుగా ఐటీ కంపెనీలతో సమావేశమైన లోకేష్ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు . ఇందులో భాగంగా ఫస్ట్ పేజ్ లో విశాఖలో ప్రముఖ దేశీయ సంస్థ టిసిఎస్ (టాటా కమ్యూనికేషన్ సర్వీసెస్ ) ను తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు . TCS ద్వారా విశాఖలో ఏర్పాటు చేయబోయే కంపెనీలో మొదటి దశగా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి . 2019-2024 ,,,జగన్ సీఎంగా ఉన్నపుడు విశాఖ , అమరావతి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తరలిపోయిన ఐటీ కంపెనీలను తిరిగి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ .
HCL విస్తరణ సన్నాహాలు : 2014-2019 టీడీపీ అధికారంలో ఉన్నపుడు it శాఖ మంత్రి లోకేష్ చొరవతో విజయవాడ సమీపంలో గన్నవరంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ సిఎల్ . సంస్థ 4,500 ఉద్యోగాలు కల్పించింది . ఇపుడు సదరు సంస్థ పేజ్ – 2లో మరో 5 వేల ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతోంది .
అమెరికా పయనం: ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు . ఇందులో భాగంగా . . అక్టోబర్ ,29, 30 తేదీలలో శాన్ ఫ్రాన్స్ స్ కో లో జరగనున్న 9వ వార్షిక ఐటి సర్వ్ సినర్జీ సదస్సులో లోకేష్ పాల్గొననున్నారు . ఈ సదస్సు ద్వారా పలు అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీల సిఈవో లతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆహ్వానించనున్నారు .
హైటెక్ సిటీ మోడల్ ఏపీలోనూ . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని దశల వారీగా అభివృద్ధి చేసిన మోడల్ ను ఏపీలో చేపట్టాలని లోకేష్ ఇప్పటికే ప్లాన్ చేసారు . ఇందులో భాగంగా విశాఖపట్నం , తిరుపతి , అమరావతి ఏరియాలలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు . 2024-2029 మధ్య కాలంలోనే తన లక్ష్యం చేరుకోవాలని లోకేష్ సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు . ఈ ఐదేళ్ల పాలనలో ఐటీ , ఎలక్ట్రానిక్స్ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు తేవాలన్నది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది .
కంపెనీలకు భరోసా ఇవ్వగలరా ? 2014-2019 మధ్య విశాఖ , విజయవాడ , తిరుపతి నగరాలలో ఏర్పాటు చేసిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు . . 2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నపుడు తరలిపోయాయి . కొన్ని చోట్ల రాజకీయ ఇబ్బందులు.. రాయితీలు అందక ఇంకొన్ని కంపెనీలు . . ఆంధ్రప్రదేశ్ నుంచి దుకాణం కట్టేశాయ్ . ఇపుడు మళ్ళీ ఆ కంపెనీలు తిరిగి రావడానికి సందేహాలు వ్యక్తం చేస్తున్నాయ్ . గత పరిణామాలు , రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ”ఏపీలో కంపెనీ పెడితే ఎంత సేఫ్ ‘ ‘ అన్న అనుమానాలతో ఉన్న ప్రముఖ కంపెనీలకు లోకేష్ ఇచ్చే భరోసా ఎంతవరకు సఫలీకృతం అవుతుంది. ఈ ఐదేళ్లు కూటమి అధికారంలో ఉన్నన్నాళ్లు సమస్య ఉండకపోవచ్చు . . తర్వాత గవర్నమెంట్ మారితే . . వాళ్ళ విధానాలు , పొలిటికల్ డెసిషన్స్ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవని భరోసా ఇవ్వగలరా ? అంటూ పలు కంపెనీల సిఈవోలు అడుగుతున్న ప్రశ్నలకు లోకేష్ చెప్పే సమాధానాలే కాదు . . ఇచ్చే భరోసా ఏమిటి ? కూటమి నేతలు చంద్రబాబు , పవన్ , లోకేష్ లను నమ్మి ప్రముఖ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తాయా ? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా కనిపిస్తున్నాయ్ .