కేకే . ఈ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మార్మోగిపోయింది . ఐదు నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అప్రతిహత విజయాన్ని ఘంటాపధంగా ముందే చెప్పారు . 175 స్థానాలకుగాను . . 162 సీట్లు గెలుస్తారని దర్జాగా బల్లగుద్ది మరీ చెప్పి . . ఆంధ్రాలో ఎదురులేని సర్వే సంస్థగా ఆకాశానికి ఎదిగేసారు కిరణ్ కొండేటి .
హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ 75 సీట్లను గెలుచుకుంటుందని ధీమాగా చెప్పిన కేకే అంచనాలు తలకిందులయ్యాయి . 37 సీట్లకు కాంగ్రెస్ పరిమితమైంది . 48 సీట్లతో అధికార బీజేపీ మరోమారు హర్యానా పీఠమెక్కింది . దీంతో కేకే సర్వే అట్టర్ ఫ్లాప్ అయినాట్యయింది . జాతీయ స్థాయిలో పేరొందిన అనేక సర్వే సంస్థలు , మీడియా దిగ్గజ సంస్థలు సైతం హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయమంటూ ముందు నుంచీ చెపుతూనే ఉన్నా . . ఎన్నికల ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి .
హర్యానాలో కాంగ్రెస్ గద్దె నెక్కుతుందని ఘంటాపధంగా చెప్పిన కేకే . .ఇపుడు నెక్స్ట్ స్టెప్ ఏమి తీసుకుంటారో వేచి చూడాలి . అతను ఏమి చెప్పినా విశ్వసనీయత కోల్పోవడంతో జనం నమ్మే పరిస్థితి ఉండదు . ఆంధ్రాలో కేకే అంచనాలు 98 శాతం ఖచ్చితత్వంతో రావడంతో . . హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు భారీ స్థాయిలో బెట్టింగ్ లు పెట్టి భారీగా నష్టపోయారు . దీనిపై కూడా కేకే పై చర్చ నడుస్తోంది .