అన్నా – చెల్లెళ్ళ డ్రామాయేనా ?

తండ్రి నుంచో ,  కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తో అయితే వాటాల కోసం గొడవ పడటం చాలా కుటుంబాలలో సాధారణమైన విషయమే .  అయితే లూఠీ చేసిన సొమ్మును పంచుకోవడానికి గొడవ కింద జనాన్ని నమ్మించి . .. ఈడీ వంటి వాటి నుంచి తప్పించుకునేందుకే జగన్ మోహన్ రెడ్డి ,  షర్మిల డ్రామా ఆడుతున్నారంటూ ఏపీలో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .  
ఎవరి ఆస్తి ఎవరికి  రాసిస్తారు??? అన్నా చెల్లెళ్ళ డ్రామాల తో ఈడీ ఎటాచ్మెంటు లో ఉన్న ఆస్తుల పై సరికొత్త వివాదానికే ఈ ఆస్తుల గొడవ.. అంటూ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది .
”జగన్ పై ఉన్న ఈ డీ కేసుల లో చాలా ఆస్తులు ఇప్పడికే జప్తు చేయబడి ఉన్నాయి.
మొన్న ఐదేళ్ళు రాష్ట్రంలో అధికారం , కేంద్రం తో సంసారం చేస్తూ ఎలాగోలా నెట్టుకు వచ్చాడు .
ఇప్పుడు ఏక్షణాన ఏమవుతుందో అని ఆ జప్తు లో ఉన్న ఆస్తుల పై వాతసత్వ హక్కుల ను కల్పించుకుని సివిల్ కోర్టు లో వివాదం చేసి పడేస్తే అలా పడి ఉంటుంది అని ఈ ఆస్తుల డ్రామా ఆడుతున్నారు.
*కేవలం ఈడీ జప్తు చేసిన ఆస్తుల మీద మాత్రమే పీట ముడి వేస్తున్నారు. ఇదీ అసలు విషయం*
ఈడీ జప్తు లో ఉన్న ఆస్తుల పై గిఫ్ట్ డీడ్ వ్రాయడానికి జగన్ కు ఉన్న అధికారం ఏమిటి??? మరల దానిని రద్దు చేసుకునేది ఏమిటి???
*కేవలం ఇది ఆస్తుల గొడవ గా చిత్రికరించే ప్రయత్నమే*
మాట మీదే వైఎస్ ఆస్తులు పంపకాలు చేసినట్లు చెప్పుకుంటున్నారు.
అది వారి కుటుంబ సమస్య.
*ఈ సరస్వతీ పవర్ గురించి మాత్రం ఈడీ జప్తు చేసి ఉన్న ఆస్తి . దీనిపై వాటాల వివాదం లేవనెత్తి జప్తు చేయబడిన ఆస్తులను కొట్టేసే ఎత్తుగడ. ఈ పదిహేయేళ్ళు గా కోర్టు గుమ్మ ఎక్కలేదు. ఇప్పుడు ఈ కొత్త వివాదం తో ఇంకో పదిహేను యేళ్ళు లాగుతారు. అప్పటికి ఈడీ కేసుల్లో ఉన్న సాక్ష్యులు మొత్తం కాలం చేస్తారు. కేసు లో జగన్ గెలుస్తాడు. జగనన్న కడిగిన ముత్యం లా బయటకు వస్తాడు*
మన చంద్రబాబు గారు ఇలాగే పధకాలు , సిక్స్ లు ఫోర్లు అంటూ తిరుగుతూ ఉంటారు.
*జగన్ కి ఇప్పటికే సెక్షన్ 17 ఎ రక్షణ ఉంది. పైన అనుమతి ఇవ్బాల్సిన కేంద్రం జగన్ డాయరు లో ఉంది*
అందుకే పీకేదేం లేదు.
అంతా డ్రామా.
అసలు జప్తులో ఉన్న ఆస్తుల పై గిఫ్ట్ ఆఫ్ రైట్ డీడు ఎందుకు??? దానిపై ఇప్పుడు ఎన్ సిఎల్ టి కి ఎందుకు??” ఇలాంటి పోస్టులు అనేకం . . ట్విటర్ ,  పేస్ బుక్ , ఇనిస్టా . , యూ ట్యూబ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ పై హల్ చల్ చేస్తున్నాయ్ .