IAS Amrapali: .. ఏపీకి ఆమ్రపాలి

ఆంధ్రప్రదేశ్ కేడర్ అయిన కొందరు ఐఏఎస్ ,  ఐపిఎస్ లు తెలంగాణ లోనే కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలను క్యాట్ తిప్పికోట్టింది .

ఏపీ కేడర్ కి గతంలో కేటాయించబడ్డ ఆమ్రపాలి . .. ఎట్టకేలకు  ఈరోజు (16-10-2024) ఆంధ్ర ప్రదేశ్ కి రానున్నారు .  ప్రస్తుతం హైదరాబాద్ మహానగర కమిషనర్ గా ఉన్నారు ఆమ్రపాలి . .  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌ (సీఏటీ) నిరాకరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి  ఏర్పడింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఐఏఎస్‌ అధికారులు భావిస్తున్నా, డీఓపీటీ విధించిన గడువు నేటితో ముగియనున్న దృష్ట్యా.. ఏపిలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారొకరు తెలిపారు. కేటాయించిన రాష్ట్రాలకు  వెళ్లండి.. తుది విచారణ తరువాత చేపడతామని క్యాట్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే .