Why Hurry: తొందర ఎందుకు చంద్రబాబూ . ..

”ఇది మంచి ప్రభుత్వం” అని చెప్పాల్సింది ప్రజలు .  పాలకులు కాదు .  అయినా 100 రోజులకే తొందరేం వచ్చింది .  మీ పాలనకు ఇంకా నాలుగు సంవత్సరాల 8 నెలల కొన్ని రోజుల సమయం ఉంది .  ఐదేళ్ల పాలనలో వంద రోజుల పాలన గీటు రాయి కాజాలదు .

విజయవాడ వరదలలో మీరు చేసిన క్రైసిస్ మేనేజ్మెంట్ అద్భుతం .  ప్రాణ నష్టాన్ని తగ్గించగలగడం ,  వరద బాధిత ప్రజలు కష్టాల నుంచి కాస్త ముందు బయటపడేలా చేయగలిగారు .  ప్రకృతి  వైపరీత్యాన్ని ధీటుగా ఎదుర్కొని  ”మీకు మీరే సాటి” అనిపించుకున్నారు .  ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అధఃపాతాళానికి వెళ్ళుపోయేలా చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచకాలు ,  అక్రమాలు ,  దుర్మార్గాలు ,  పాపాలు అన్నీ ,  ఇన్నీ కావు .  వాటిని దాటుకుని మీరు మరో నాలుగున్నరేళ్ల పాలన సాగించాలి .

”ఇది మంచి ప్రభుత్వం ‘ ‘ అని ప్రజల వద్దకు వెళ్లి చెప్పాల్సింది మీరో ,  పవన్ కళ్యాణ్ గారో కాదు . . ప్రజల్ని కలవాల్సింది వాళ్ళ సమస్యలు తెలుసుకోవడాని కావలి తప్ప . . మీ డప్పు కొట్టుకోవడానికి కాదని గుర్తుంచుకోవాలి .  పరిపాలన మెరుగ్గా చేస్తున్నా . . మీరు చేసిన ప్రతితీ గొప్పలు చెప్పుకోవడం మీరు తగ్గించుకోవాలి .  వంద రోజుల పాలనా గొప్ప గురించి ఇంటింటికీ స్టిక్కర్లు అతికించే ప్రక్రియ చూస్తుంటే . . గతంలో జగన్ కూడా ఇలాగె చేసాడు .  ఇలాంటి చులకన పనులు మానుకుంటే మీ విజ్ఞత నిలబడుతుంది .  ప్రజలకు మెరుగైన పాలనపై దృష్ సారించిన మీరు పధకాలను ఇంకా మెరుగ్గా ఎలా అమలు చేయాలనే దానిపై ద్రుష్టి పెట్టండి .