Heavy Rins: విశాఖ, కాకినాడ తీరాల్లో ఎగసిపడుతున్నఅలలు

ఏపీ ప్రజలు భారీ వర్షాలు ప్రజలను భయం గుప్పెట్లోకి నెట్టాయి. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. విశాఖ, కాకినాడ తీరాల్లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఆ అలలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖ ఆర్కేబీచ్ వద్ద అలలు భీకర శబ్దంతో తీరాన్ని  తాకుతున్నాయి.

అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.  చెట్లు, విద్యుత్తు స్తంభాలతోపాటు పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అంతర్వేదిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోనసీమ జిల్లాలోని ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. గత ఆరు గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది.

శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి మండలం వెల్దుర్తి సమీపంలోని చిత్రావతి వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ముంచెత్తుతుండడంతో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.