జీవి రెడ్డి రాజీనామా . . టీడీపీకి పెద్ద మైనస్ . .

జీవి రెడ్డి .  ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన యువనేత. టీడీపీ అధికారంలో లేని సమయంలో 2021 లో ఆ పార్టీలో చేరి . … అప్పటి అధికార వైసీపీ అరాచకాలపై పద్దతి ప్రకారం ధ్వజమెత్తి ,  జనంలో జగన్ సర్కార్ అరాచకాలు ,  అక్రమాలను కడిగేసిన నిఖార్చయిన నేతగా టీడీపీలో పేరుంది .  అలాంటి నేతను తెలుగుదేశం అధిష్టానం చేతగాని చేష్టలతో వదులుకోవాల్సి వచ్చింది.

కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా , , పాలనపై ఇంకా పట్టు సాధించని సీఎం చంద్రబాబు . . ఈ వ్యవహారంతో టీడీపీ హార్డ్ కొర్ కేడర్ లో చులకనైపోయినట్లు కనిపిస్తోంది .

జీవి ..  తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవిని వదిలేసారు .  ఈ విషయాన్ని ట్విటర్  ద్వారా వెల్లడించారు .   తాను ఏ  రాజకీయ పార్టీలో చేరబోనని కూడా స్పష్టం చేసారు .  న్యాయవాదిగా   తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు. అనతికాలంలోనే . .  దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు.

టీడీపీ కోసమే జీవి రెడ్డి ఫైట్ . . 

చంద్రబాబు ,  పవన్ కుటుంబ సభ్యులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కి ఫైబర్ నెట్ లో పోస్టులు ఇచ్చారు .  జీవి రెడ్డి చైర్మన్ అయ్యాకా వారందరినీ తొలగించాలని ఎండీ కి ఆదేశించారు .  అయితే వైసీపీ హార్డ్ కొర్ గా ఉన్న ఫైబర్ నెట్ ఎండీ దినేష్ . . మాత్రం . . వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కి ఈ నెల కూడా జీతాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసారు .  ఈ విషయాన్నీ జీవి రెడ్డి ప్రభుత్వ పెద్దల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది .  దీంతో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడి చేసారు .

సీఎం చంద్రబాబుకి ఈ వ్యవహారం కోపం తెప్పించింది .  జీవిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు .  అయితే అక్రమాలకు పాల్పడిన ఫైబర్ నెట్ ఎండీని మాత్రం చంద్రబాబు వెనకేసుకొచ్చినట్లు చెపుతున్నారు .  ఐఏఎస్ అధికారులు ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఈ విధంగా చేసినట్లు ప్రచారం జరుగుతోంది .

చంద్రబాబు ధోరణి ఇంతే . .

వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ ని ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ తో నింపేసి . . టీడీపీ ,  జనసేన వారిపై బూతులు పెడుతూ నానా యాగీ చేశారు .  అలాంటి బ్యాచ్ ని ఇంకా కొనసాగిస్తూ . . సంస్థ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి .  అయితే దీనిపై ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో పోరాటం చేస్తున్న జీవికి మద్దతు లభిచనకపోగా . . ఛీత్కారం ఎదురయింది .  ఇదే ధోరణి టీడీపీలో కొనసాగుతోందని కేడర్ గగ్గోలు పెడుతున్నా . . చంద్రబాబుకి మాత్రం ఈ ఘోష వినిపించడంలేదు .

పార్టీకి తీవ్ర నష్టం . . జీవి రెడ్డి రాజీనామా వ్యవహారం టీ కప్పులో తుఫాన్ .. అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నా , , టీడీపీ కేడర్ కి తప్పుడు సంకేతం వెళ్ళింది .

చంద్రబాబును ,  పవన్ ని ,  వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టకుండా ,  చట్టపరంగా శిక్షలు పడకుండా , , కాపాడుతున్న ఫైబర్ నెట్ ఎండీ ,  ఇతర అధికారులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నట్లు పార్టీ కేడర్ కి సంకేతాలు వెళుతున్నాయి .

జీవి రెడ్డిపై టీడీపీ లో కొందరు తమ సోషల్ మీడియా విభాగంతో ”జీవి రెడ్డి వైసీపీ కోవర్ట్ ‘ ‘ అంటూ తప్పుడు పోస్టులు పెట్టించారు .  ఇది పార్టీలో మెజార్టీ నేతలు ,  కేడర్ తిప్పికొట్టారు .  దీంతో టీడీపీ లో కొందరు చేసిన నక్కజిత్తులు వ్యవహారం తేలిపోయింది .  ఈ వ్యవహారంతో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లయింది .  అయినా చంద్రబాబుకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదు . . అంటూ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు .