”అమరావతిని భారత దేశ డ్రోన్ సిటీగా తీర్చిదిద్దుతాం . ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించుకుని డ్రోన్ తయారీ వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్జనంతో ముందుకు తీసుకుపోతాం . డ్రోన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయిలో నిలబెడతాం . .” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు . ”అమరావతి డ్రోన్ సమిట్ 2024”ను మంగళవారం చంద్రబాబు నాయుడు మంగళగిరి సికె కన్విన్సన్ లో ప్రారంభించారు .
”1995 లో ఐటి గురించి ఆలోచన చేశాను . ప్రపంచాని కంటే కాస్త ముందు మనం మేల్కొన్నాం . హైటెక్ సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ రోజు లక్షల ఉద్యోగాలు దక్కించుకోగలిగాం . . అలాగే డ్రోన్ వ్యవస్థ కు ఉన్న అవకాశాలను ముందుగానే అంచనా వేస్తూ . . వాటిని పక్కదారిపట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే . . అభివృద్ధి దిశగా మనం ఫోకస్ పెడదాం . అమరావతిని డ్రోన్ మాన్యుఫెక్షరింగ్ హబ్ గా తయారు చేసుకుందాం . . ” అని చంద్రబాబు పేర్కొన్నారు . డ్రోన్ డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ చెంజర్ కానుందన్నారు . విజయవాడ వరదలలో డ్రోన్లను ఉపయోగించి బాధితులకు ఆహారం , తాగునీటిని అందించిన విషయాన్నీ చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేసారు . విదేశాలలో ఉన్న ఐటీ నిపుణులతో 30 శాతం మంది తెలుగువారే ఉండటం గర్వకారణంగా ఉందన్నారు .
సదస్సులో కేంద్ర పౌర , విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ . .”యువతతో పోటీపడుతూ పనిచేసే చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు . .దేశాభివృద్ధికి నిరంతరం ఆలోచించే వ్యక్తి ప్రధాని మోడీ . .” అని చెప్పుకొచ్చారు .
హైదరాబాద్ హైటెక్ సిటీ . . అమరావతి డ్రోన్ సిటీ . .
1995 లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ కి రూప కల్పన చేయడం ఒక చారిత్రక ఘట్టం . అదే స్పూర్తితో అమరావతిలో డ్రోన్ హబ్ గా రూపొందించేందుకు చంద్రబాబు కేంద్రం నుంచి సహాయం తీసుకుని . . తనకున్న అంతర్జాతీయ పలుకుబడితో విదేశాల నుంచి పలు కంపెనీలను రప్పించనున్నారు . ఈ మేరకు ఇప్పటికే కార్యాచరణ మొదలైంది . అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిచ్చితి కారణంగా డ్రోన్ తయారీ రంగం ఏ మేరకు వృద్ధిని సాధిస్తుందోనన్న అనుమానాలు సైతం ఇక్కడ నిపుణులను వేధిస్తోన్న ప్రశ్న .