Chandrababu: ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనండి: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన సలహా ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు. ఒకప్పుడు జనాభా నియంత్రణ ముద్దు.. ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనాలని.. లేకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదట మరి.

అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన  జనాభా పెరుగుదల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ హితం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలకు ఆడపడుచులు కృషి చేయాలని   కోరారు. అంతే కాదు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అయ్యే విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నామన్నారు.  రాష్ట్రంలో జనాభా పెరగాలి..  ఒకప్పుడు జనాభా నియంత్రణ ఉండాలని చెప్పా.. ఇప్పుడు నేనే వద్దంటున్నా..  అని చెప్పారు.