బోరుగడ్డ.. సజ్జలను కూడా ఇరికిస్తాడా?

”వైసీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే టీడీపీ ,  జనసేన నేతలను ,  ఇతరులను తిట్టాను .  చంపుతానని బెదిరించాను .  పార్టీలో పెద్ద పొజిషన్ ఇస్తారని మాత్రమే ఇలా చేశాను . .” అంటూ వైసీపీ నేత ,  రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్  ఇచ్చిన వాంగ్మూలంతో  ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా ఈ కేసులో ఇరుక్కునే డేంజర్ పొంచి ఉందా ?  అంటే ఔననే అంటున్నారు న్యాయనిపుణులు.

అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి కీలక నేతలను సైతం చంపుతానని బెదిరించాడు . ఇలా  బెదిరించిన  ఘటనలు ఇపుడు బోరుగడ్డ పై హత్యాయత్నం వంటి సీరియస్ కేసులకు దారితీయనున్నాయ్ .  టీడీపీ , జనసేన  కీలక నేతలు కుటుంబాలకు చెందిన మహిళలపై రాయడానికి వీల్లేని పదజాలంతో జుగుస్సాపకారంగా తిట్టాడు .  బెదిరింపులకు పాల్పడుతూ . . ఇష్టానుసారం బూతులు తిడుతూ . .ఇంటర్వ్యూ లు ఇచ్చిన బోరుగడ్డ అనిల్ పై ఆ ఘటనలలోనూ కేసులు నమోదయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయ్ . 

వీటితో పాటు . . జగన్ సీఎంగా ఉన్న సమయంలో బోరుగడ్డ అనిల్ గుంటూరు ,  విజయవాడ పరిసరాలలో చేసిన భూ సెటిల్ మెంట్లు ,  ఇతర లావాదేవీలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే .  వీటన్నింటిపైనా లోతైన విచారణ పూర్తిచేసి చర్యలకు సిద్ధమవుతారు .  బోరుగడ్డ నోరు విప్పి మొత్తం చెపితే . . సజ్జలతో పాటు ఇంకెందరు వైసీపీ నేతలు ,  అధికారులు ఇరుక్కుంటారో నన్న ఆందోళన ఆయా వ్యక్తులలో కనిపిస్తోంది .

 తాను తెర వెనుక నుంచే  అన్నీ పనులు చేశానని.. టీడీపీ వాళ్ళని  వేధించినా ,  బండ బూతులు తిట్టించినా  ఆధారాలు దొరకవని ఇప్పటి వరకు ధీమాగానే ఉన్నారు .   ఇపుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారంతో సజ్జల గుట్టు రట్టయ్యే ఛాన్స్ కనిపిస్తోంది .  వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమీ . . అంటే . . అక్కడ అంతా నడిపించేది అధికారంలో ఉన్నపుడు . . సజ్జల రామకృష్ణా రెడ్డి అని అందరికీ తెలిసిందే .  ఇప్పటికే ముంబయ్ నటి కాదంబరి జెత్వాని కేసులో కీలక సూత్రధారిగా సజ్జల పేరు వినిపిస్తోంది .  

బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఆయన ల్యాప్ ట్యాప్, ఫోన్, ఇతర గాడ్జెట్స్  స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది .    వైసీపీకి సపోర్ట్ గా ఉన్న   యూట్యూబ్ చానళ్లు వాళ్ళు వచ్చే తేదీలు ,  వాళ్ళు వచ్చినపుడు   మాట్లాడాల్సిన అంశాలు . . సంబంధిత విషయాలపై వందల కొద్దీ మెసేజ్ లు బయటపడినట్లు సమాచారం.