AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్ర‌బాబు తీపి కబురు

ఏపీ ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు తీపి కబురు చెప్పారు.  రాష్ట్ర‌వ్యాప్తంగా నేటి నుంచి చెత్త ప‌న్ను రద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. అధికారుల‌ను ఎక్క‌డా ప్ర‌జ‌ల నుంచి చెత్తప‌న్ను వ‌సూలు చేయ‌వద్దని ఆదేశించారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా మ‌చిలీప‌ట్నంలో నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేసింది. రోడ్ల‌పై 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాదిలోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాల‌ని మంత్రి నారాయ‌ణ‌ను ఆదేశించాం అని, 2029 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 2, 2014లో స్వ‌చ్ఛ భార‌త్‌కు స్వీకారం చుట్టారు.  దానికి అంద‌రం ప్ర‌ధానికి అభినంద‌నలు తెలియ‌జేయాలి. మ‌న ప‌రిస‌రాలు శుభ్రంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. నీతి ఆయోగ్‌లో స్వ‌చ్ఛ భార‌త్‌పై ఉప‌సంఘం నియమించారు. దానికి చైర్మన్గా  ఉన్నాను.  చెత్త నుంచి సంప‌ద సృష్టించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను అని చంద్ర‌బాబు తెలిపారు.