AP Budget : ఏపీలో కొత్త పథకాల ( New Schemes) అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దఈష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget) తో పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ (Chandra Babu Government) తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ (Budget) వైపు తీవ్ర కసరత్తు చేస్తోంది.
పూర్తి స్థాయి బడ్జెట్ నేపథ్యంలో కీలక శాఖలతో ప్రభుత్వం వరుస సమీక్షలు (Reviews) నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలాఖరులో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని భావిస్తోందని సమాచారం. దాంతోపాటుగా ఎన్నికల సమయం (Elections Time) లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని యోచనలో ఉందని తెలుస్తోంది.
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆర్థిక శాఖ (Financial Department) సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 31వ తేదీ లోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ (Orders Issued) చేసింది. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలకు ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పెన్షన్ రూ.4 వేలకు పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం దసరా నుంచి మరో రెండు పథకాల (Two Schemes) ను అమలు చేయాలని భావిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ( Free Bus) మరియు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ( Free Gas Cylinders) ను అందించాలనుకుంటున్న సర్కార్ వీటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాత సుఖీభవ నిధుల (Annadhatha Sukhibhava Funds) ను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.