Amaravati Safe: అమరావతి సేఫ్ . .

ఆంధ్రప్రదేశ్  రాజధాని   అమరావతి  (Capital City) ఇటీవల భారీ వర్షాలు ,  వరదలకు తట్టుకుని నిలబడింది . రాజధాని నగరానికి అటు – ఇటు ఉన్న గుంటూరు ,  విజయవాడ నగరాలను వరద అతలాకుతలం చేసింది .  అమరావతి మాత్రం సేఫ్ గా ఉంది .  అయినా వైసీపీ మీడియా మాత్రం అమరావతిపై బురద వేస్తూనే ఉంది .    అమరావతిలో  నవ నగరాలు  నీట మునిగాయంటూ . .. దుష్ప్రచారానికి ఒడిగట్టిన వైసీపీ మీడియా నాలుగు రోజులుగా అదే పనిలో బిజీగా ఉంది .  అయితే ఇందుకు ధీటుగా అమరావతిలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు చూపిస్తున్నాయి .    నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు   చెప్పినట్లు అమరావతి స్థల మహత్యమో, ప్రకృతి వరమో తెలియదుగానీ అమరావతి మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి.                                                                             ప్రకృతి పెట్టిన కాల పరీక్షల్లో అమరావతి  అత్యధిక మార్కులతో పాసై ప్రజా రాజధానిగా సగర్వవంగా  నిలిచింది..  రాజధానికి ఈ ప్రాంతం  అత్యంత అనువైన, సురక్షితమైన ప్రాంతంగా మరోమారు నిరూపించుకుంది.    ‘కృష్ణానదిని ఆనుకుని ఉన్న రాజధాని వరదల బారిన పడి మునిగి పోతుందని ప్రచారం చేయాలని వైసీపీ మూక  చూసింది.  వరద ముంపునకు గురైతే ఆ కారణం చూపి విశాఖకు రాజధానిని తరలించుకోవాలని ప్రయత్నించింది. కానీ వరద అమరావతి ని ప్రభావితం చేయలేదు .    తాజా రికార్డు వరద సమయంలోనూ అదే దుష్ప్రచారానికి వైసీపీ బ్యాచ్ మరోమారు  తెరలేపింది. అయినా వాస్తవాలను చూసి జనం జగన్ పార్టీని ,  ఆ నీలిమీడియాను పట్టించుకోవడం మానేశారు .