-దేవాలయాలపై ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ జాతీయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం . .
హిందూదేవాలయాలను ప్రభుత్వ గుప్పిట నుంచి విడిపించాలని , స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ”హైందవ శంఖారావడం ‘ మోగిస్తున్నారు హిందూ బంధువులు . విశ్వ హిందుపరిషత్ ‘ ఆధ్వర్యంలో 2025, జనవర్ 5, న గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ‘హైందవ శంఖారావ0’ నిర్వహిస్తున్నారు . తెలుగు రాష్ట్రాల నుంచి ఈ శంఖారావ సభకు 3-4 లక్షల మంది హిందూ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు .
అయోధ్య రామజన్మ భూమి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు . హిందూ సమాజాన్ని జాగృతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ”హైందవ శంఖారావం ‘ సభ సక్సెస్ చేసేందుకు నెలరోజులుగా VHP , ఇతర హిందూ సంఘాల నేతలు , స్వామీజీలు కృషి చేస్తున్నారు .
” ప్రభుత్వాల నుంచి ఆలయాలకు స్వయంప్రతిపత్తి వచ్చేవరకు , ,దీని కోసం చట్ట సవరణ జరిగే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం . హిందూ సమాజాన్ని ముందుకు నడిపించడమే మా ఉద్దేశ్యం. భారతదేశంలో .. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే శంఖారావం సభ నాంది పలుకుతుంది . .” అని విశ్వ హిందుపరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి తనికెళ్ళ సత్య రవి కుమార్ ప్రకటించారు .
ఈ బహిరంగ సభ జనవరి 5, మధ్యాహం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించతలపెట్టారు .
స్వామీజీలు , మాతాజీలు , కేంద్రీయ సంఘటన ప్రతినిధులు , రామజన్మ ట్రస్ట్ గోవింద్ గురుదేవ మహారాజ్ ఈ సభలో పాల్గొంటున్నారు .
ఈ సభలో దేవాలయాలలో అన్యమత ఉద్యోగుల తొలగింపు , వ్యాపార ధోరణిని విడనాడట వంటి డిమాండ్లు ఉన్నాయి .
హిందూ సమాజంపై జరుగుతున్న దాడులు , ఆలయాలపైనా , హిందూ సంప్రదాయాలపైనా జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కొవాలనేదానిపై కూడా సభలో సూచిస్తారు .
రాజకీయ ప్రమేయంతో హిందువులపై దాడులు జరగడం , బాధితులైన హిందువులపైనే కేసులు పెట్టడం పైనా చర్చ ఉంటుందని ప్రతినిధులు చెపుతున్నారు .
కులాలకు అతీతంగా హిందువులు అనే స్పృహ కలిగించే రీతిలో కూడా ఈ సభను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది .
హిందూ సమాజాన్ని హిందువులే రక్షించుకునే రీతిలో స్ఫూర్తిని కలిగించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెపుతున్నారు.