హైదరాబాద్ జనాభా 11.50 లక్షలు . రోజు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలు , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోయే వారి సంఖ్య మరో లక్షన్నర . రోజు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 5.5 లక్షలు. 2017 నవంబర్ 28న ప్రారంభం అయినా మెట్రో రైలు ప్రాజెక్ట్ కు ఇప్పటికి బ్రేక్ ఈవెన్ అవుతోంది .
విజయవాడ జనాభా 4.5 లక్షలు . విశాఖపట్నం జనాభా . .3.40 లక్షలు . మరో పదేళ్ల వరకు మెట్రో రైళ్లకు ఈ రెండు నగరాలలో వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు నిపుణులు .
తోలి దశకు ఏపీ సర్కార్ ఆమోద . 0
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్‌ను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కిలోమీటర్ల మేర ఒకటో కారిడార్‌గా డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇక గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీసు వరకూ రెండో కారిడార్‌ను 5.08 కిలోమీటర్ల మేర నిర్మించనుంది. మూడో కారిడార్‌గా తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.మొదటి దశలో మొత్తం రూ. 11,498 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తుంది. అలాగే రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 30.67 కిలోమీటర్ల మెట్రో రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె.కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడలో . ., . .,
విజయవాడ నగరంలో రెండు దశలుగా మెట్రోరైల్ ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మొదటి దశలో రెండు కారిడార్‌లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు .