1983లో తెలిసారి తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఇటీవల వరకు టీడీపీలో ఆయనకు తిరుగులేదు . 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక అత్యున్నత పదవులు ఇచ్చి పార్టీ అతనికి అత్యున్నత స్తానం కట్టబెట్టింది . అతను మాత్రం రాజకీయ శరమాంకంలో పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాలరాసుకున్నారు . రాష్ట్ర స్థాయిలో టీడీపీ రాజకీయాలను నాలుగు దశాబ్దాలపాటు శాసించిన సదరు నేత … ఇపుడు సొంత నియోజకవర్గం తుని వరకే పరిమితం కావాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు.. యనమల రామకృష్ణుడు .
రాజ్యసభ సీటు తనకు దక్కడంలేదన్న అక్కసుతో .. చంద్రబాబును ఉద్దేశించి యనమల రామకృష్ణుడు రాసిన లేఖ ఏకంగా ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడింది . ” సీనియర్లలో తనకు ఇబ్బంది కలిగించే నేతల్ని , తనను పట్టించుకోనివారిని ఎలా పక్కన పెట్టాలి . .” అని లోకేష్ సీరియస్ గా ఆలోచించుకుంటున్న తరుణంలో .. యనమల పెట్టుకున్న ”భస్మాసుర హస్తం ”తో ఎవరూ పొగపెట్టకుండానే పార్టీ క్రియాశీల నాయకత్వం నుంచి వైదొలగాల్సి వచ్చింది. యువనేత, ఐటీ, హ్యూమన్ రిసోర్సెస్ మినిష్టర్ నారా లోకేష్ కు యనమల లేఖ అంశం ఎంతగానో కలిసొచ్చినట్లు పార్టీ సీనియర్లు భావిస్తున్నారు .
తుని లోకల్ . . రాష్ట్ర స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది . తుని గెస్ట్ హౌస్ లో కూర్చుని . . స్థానిక రాజకీయాలకే పరిమితమైన సంకేతాలు ఇస్తున్నారు . టీడీపీకి చెందిన కార్యకర్తలెవరైనా వచ్చి సమస్య చెపుకుందామంటే వినడానికి ఇష్టపడటంలేదట యనమల . అతనికి ఉన్న ప్రెస్టేషన్ ను వారిపై చూపుతున్నారట . సమస్య చెపుతున్న వారిని ఆపమంటూ బెల్ కొడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
కాకినాడ సెజ్ భూములలో బిసి రైతులను మోసం చేసారంటూ కమ్మ కులం టార్గెట్ గా యనమల రాసిన లేఖ కలకలం సృష్టించింది . దివీస్ సంస్థ కూడా భూములను కారు చౌకగా కొట్టేసిందని . . మురళి చౌదరి అంటూ దివీస్ అధినేత పేరు వెనుక కులాన్ని సూచించే తోక తగిలించి . . కమ్మ సామాజిక వర్గం ఆగ్రహానికి లోనయ్యారు యనమల . 2014-2019 మధ్య యనమల ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడే దివీస్ కి భూములు ఇప్పించిండే అతను . ఆ విషయాన్నీ యనమల మర్చిపోయారా ఏంటో మరి .
2005-2009 మధ్య కాలంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇలాంటి పని చేసి పార్టీలో చులకనయ్యారు. చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలను అప్పట్లో తప్పుపట్టిన బుచ్చయ్యకు తర్వాత జ్జ్ఞానోదయం అయింది . యనమల మాదిరి అధినేతను ఇరుకునపెడుతూ లేఖ రాయలేదు బుచ్చయ్య . కోస్తా పరిరక్షణ సమితి పేరుతో టీడీపీలో వేరుకుంపటి పెట్టాలన్న వ్యూహంతో ఆయన చేసిన ప్రయోగం . . ఇప్పటికీ మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతోంది .
తుని నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోయినా . . 2014లో చంద్రబాబు కేబినెట్ లో యనమలను ఆర్ధిక మంత్రిని చేశారు. పార్టీ అధికారంలోలేనపుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ గా కీలక పదవికి ఎంపిక చేశారు . ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు . ఆయన కుమార్తెకు తుని ఎమ్మెల్యే సీటు ఇచ్చి టీడీపీ గెలిపించుకుంది . మొదటిసారి గెలిచినా దివ్యకు పార్టీ విప్ పదవి కూడా ఇచ్చారు . యనమల చిన్నల్లుడు మహేష్ యాదవ్ ని రాయలసీమ నుంచి తీసుకువచు ఏలూరు ఎంపీ సీటు కట్టబెట్టారు చంద్రబాబు . యానాలకు ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతతో చంద్రబాబుపై పార్టీ సీనియర్ నేతలలో ఇప్పటికీ కోపం ఉంటుంది . అయితే ఏమీ చేయలేని నిస్సయాయ స్థితిలో మిన్నకుంటారు .
జనసేనలోకి యనమల కృష్ణుడు : ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు జనసేనలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెపుతున్నారు . టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలోనే ఉన్న కృష్ణుడు ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల ముందే జెండా మార్చారు . అయితే రాజకీయంగా ప్రాభవం సంపాదించాలంటే పార్టీ మారక తప్పదని భావిస్తున్న కృష్ణుడు … త్వరలోనే జనసేన కండువా కప్పుకుంటారని చెపుతున్నారు . కృష్ణుడు జనసేనలో చేరితే అతని బలం అనూహ్యంగా పెరుగుతుంది . అధినేత చంద్రబాబును రాజకీయంగా ఇరుకునపెట్టాలన్న ఉద్దేశ్యంతో లేఖ రాసిన యనమల రామకృష్ణుడిని వదిలి కృష్ణుడు వెనుక ఎక్కువమంది చేరే అవకాశం ఉందని తుని అసెంబ్లీ టీడీపీ , జనసేన నాయకులు చెపుతున్నారు .