యనమలను ఉపేక్షిస్తారా ?

తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడిపై రాజకీయ కుట్రకు యనమల తెరలేపారా ?

”ఇన్నాళ్లు కాపు నేతలను చులకనగా చూస్తూ వచ్చిన యనమల ఇపుడు కమ్మ వారిని దోపిడీదారులుగా చిత్రీకరించే కుట్రకు తెర తీసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధిష్టానం మేల్కొనకపోతే యనమల కుట్రతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే డేంజర్ కనిపిస్తుంది . .” అని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత . . చంద్రబాబు , లోకేష్ లకు మెయిల్స్, లేఖల ద్వారా మెసేజ్ లు పంపారు. దీనిపై పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

యనమల రామకృష్ణుడు వల్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీని వదిలిపెట్టాల్సి వచ్చింది . ఎన్టీఆర్ , చంద్రబాబు నాయుడులపై తామెప్పుడూ ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళం . పార్టీ చంద్రబాబు చేతికి వచ్చాకా . . తూర్పుగోదావరి జిల్లాను పూర్తిగా యనమల పెత్తనంలోకి వదిలేసారు . ముందు నుంచీ అతనికి కాపు నాయకులంటే అస్సలు గిట్టదు. కాపు నాయకత్వ్యాన్ని అంగీకరించని మనస్తత్వం.. అందుకే ఈ జిల్లాలో కాపు నాయకులలో కీలకమైన వాళ్ళందరం పార్టీ మారిపోవాల్సి వచ్చింది . . ”

జిల్లాలో అధికార టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలివి . యనమల రామకృష్ణుడు వల్ల టీడీపీని వీడిన నేతల జాబితాను తయారు చేసి టీడీపీ ప్రధాన కార్యాలయం మంగళగిరి పంపినట్లు ఓ టీడీపీ సీనియర్ నేత తెలిపారు . ”మేమంతా బాహాటంగానే యనమల గురించి మాట్లాడగలం . మా నాయకుడు చంద్రబాబు పై ఉన్న గౌరవంతో రోడ్డెక్కడంలేదు . .” అని మరో యువనేత పేర్కొన్నారు.

-”42 ఏళ్ల రాజకీయ జీవితంలో యనమల ఎపుడూ బీసీల బాగు గురించి మాట్లాడలేదు . ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని పేర్ల చివర చౌదరి . . అని లేఖలో ప్రస్తావించడం దురుద్దేశం కనపడుతోంది . ఇలాంటి వాటిని పార్టీ ఉపేక్షించకూడదు . .” అని శాసన మండలి మాజీ చైర్మన్ , టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రమణ్యం అన్నారు .

ఆ సామాజిక వర్గం అంటే ఎందుకంత చులకన..

ముందు నుంచీ యనమలకు మా సామాజిక వర్గం అంటే అత్యంత చులకన భావం. ఎందుకో తెలియదు . మా సామాజిక వర్గాన్ని పురుగుల మాదిరి చూసేవారు. దీనిపై చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లాం . . అయినా మార్పు కనిపించేది కాదు. ఇక ఈయనతో వేగలేక ప్రజారాజ్యంలోకి, కాంగ్రెస్ లోకి , తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ లోకి వలసపోయిన నేతలు అనేకమంది ఉన్నారు . .” అంటూ కూటమిలో కీలక నేత ఒకరు వెల్లడించారు.

పవన్ పెత్తనాన్ని సహించలేక : .. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎం: అయ్యాక యనమల దృక్పధం పూర్తిగా మారినట్లు ఈ ప్రాంత టీడీపీ , జనసేన నేతలు చెపుతున్నారు. 42 ఏళ్ల పాటు టీడీపీ కాపు నాయకులను చెప్పుచేతల్లో ఆడించిన యనమలకు ఇది మింగుడుపడటంలేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 1983 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ”యనమల రామకృష్ణుడు ‘ ‘ చెప్పిందే వేదం. ఇక్కడ అతను ఎవరికి చెపితే వాళ్ళకే ఎమ్మెల్యే , ఎంపీ , జడ్పీ చైర్మన్ , ఎమ్మెల్సి,, కార్పొరేషన్ . . ఇలా ఏ పదవైనా యనమల ప్రాపకం ఉండాల్సిందే. తూర్పు గోదావరి జిల్లాలో ఏ టీడీపీ నేతను అడిగినా పై విషయాన్నీ తడుముకోకుండా ద్రువీకరిస్తారు.

  • టీడీపీలో రవాణాశాఖ మంత్రిగా పదవి నిర్వహించిన తోట సుబ్బారావు .. యనమల పోరు పడలేక కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు పార్టీ కార్యాలయానికి రాసిన జాబితాలో వెల్లడి చేశారు .
  • జ్యోతుల నెహ్రూకి 1999 లో మంత్రి పదవి రాకుండా యనమలే అడ్డుపడినట్లు జగ్గంపేట పార్టీ నేతలు ఇప్పటికీ చెపుతూనే ఉంటారు .
  • ఈ కారణంగానే జ్యోతుల నెహ్రు 2009 లో ప్రజారాజ్యం , 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు వలస వెళ్లారని చెపుతున్నారు .
  • కోనసీమకు చెందిన మెట్ల సత్యనారాయణరావు, తోట త్రిమూర్తులు తదితర కీలకనేతలంతా యనమల ఒంటెద్దు పోకడలను తట్టుకోలేక పార్టీని వీడారు.

కమ్మ సామాజిక వర్గం టార్గెట్ గా . . ఇంత వరకు రాజకీయంగా కాపు సామాజిక వర్గంలో కీలక నేతలను ఎదగకుండా అడ్డుపడుతూ వచ్చిన యనమల రామకృష్ణుడు ఇపుడు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

కాకినాడ సెజ్ భూములను బడాబాబులు కారు చౌకగా కొట్టేశారని ఆరోపణలు చేసారు యనమల రామకృష్ణుడు . ఇందులో తప్పేమీ లేదు . కాకినాడ సెజ్ భూములు 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సేకరించారు . అప్పట్లో యనమల ప్రతిపక్షంలో కీలక నేతగా ఉండి ఎందుకు వ్యతిరేకించలేదు. 2014-2019 లో యనమల ఎమ్మెల్యే కాకపోయినా . . ఆర్ధిక మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారు . అప్పట్లో జరిగిన దివీస్ కంపెనీ భూముల కేటాయింపులోనూ యనమల కీలకంగా వ్యవహరిచారు .

తాజాగా ఈ భూముల సేకరణలో అక్రమాలు జరిగాయని , బీసీ రైతులు , మత్సకారులు నష్టపోయారని యనమల సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు . అయితే 10 వేల ఎకరాల సెజ్ లో ఎస్సీ , ఎస్టీ , ఓసీ రైతులెవరూ లేరా ? నష్టపోయిన వారంతా బీసీ రైతులేనా ?

పైగా . . సెజ్ భూములకు కెవి రావు చౌదరి తక్కువ ధరకు తీసుకున్నారని కులం పేరు వచ్చేలా ప్రస్తావించారు . దివీస్ మురళి చౌదరి అని దివీస్ చైర్మన్ కి తోక తగిలించారు . దివీస్ మురళి , సెజ్ , పోర్ట్ చైర్మన్ కెవి రావు ల పేర్ల వెనుక చౌదరి అనే పేరు పెట్టుకోలేదు . రికార్డులలో సైతం ఈ పేరు ఉండదు . కెవి రావు చౌదరి , మురళి చౌదరి అని ఎగతాళిగా రాసి . .. జనంలో ఈ కులాన్ని దోపిడీదారులుగా చిత్రీకరించాలని యనమల పన్నాగంలా కనిపిస్తోంది.

యనమలను ఉపేక్షిస్తారా ? కాకినాడ పోర్టు , సెజ్ భూములను బెదిరించి అతి తక్కువ ధరకు లాక్కునే అరబిందో కంపెనీని, ఇందులో సూత్రధారులుగా ఉన్న విజయసాయి రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి , విక్రాంత్ రెడ్డిలపై చర్యలు తీసుకోవడం ద్వారా వైసీపీని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు మొదలెట్టిన ప్రయత్నానికి గండి కొట్టాలని యనమల చేసుకున్న ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అయింది ? పార్టీ అధినేతను ఇరుకున పెట్టడానికి ఆయన కుట్రను ఛేదించడానికి అధిష్టానం చర్యలు చేపట్టిందా ? యనమల వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుని వదిలేస్తారా ? ఈ ప్రశ్నలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయ్ . వీటికి చంద్రబాబు ఏం సమాధానం చెపుతారు ? ఉపేక్షిస్తే . . ఇలాంటి లేఖలు రాసి బెదిరించడానికి చాలా మంది తయారవుతారని చంద్రబాబు గుర్తిస్తే పార్టీకి , అతనికి మంచిది. లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు .