- హిల్ వ్యూ పాయింట్ నుంచి పోలవరం డ్యామ్ పరిశీలన
- పనులు జరుగుతున్న తీరుపై ఆరా
పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి పోలవరం డ్యామ్ ను పరిశీలించిన ఆయన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే పనులు జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అలాగే పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు.
కాగా, ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని వడివడిగా అడుగులు వేస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.