పవన్ అంటే మహాశక్తి..

జనసేనానిని టచ్ చేయాలంటే జనసైనికులను దాటుకొని వెళ్లాలి..

ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి..

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జెడ్ ప్లస్ కేటగిరి, సెక్యూరిటీ తమ పవన్ కు కల్పించాలని అని జనసేన పార్టీ తిరుపతి జిల్లా, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, మధుబాబు, సుమన్ బాబు, మునస్వామి, కిషోర్ , హేమంత్ , పురుషోత్తం , మణికంఠ , శ్రావణ్, పవన్ కుమార్, వినోద్, రమేష్ రెడ్డి, సాయి, సుధాకర్ లు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వీరు మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ ఇప్పుడు భారతదేశానికి అవసరమని.. మహారాష్ట్రలో జరిగిన బిజెపి నూరు శాతం ఫలితాలే అందుకు అద్దం పడుతున్నాయని.. కావున ప్రధాని, సీఎంలకు ఇచ్చే జెడ్ ఫ్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నించడమే కాకుండా.. రాష్ట్ర ప్రజలను కాపాడే దిశగా ఎన్డీఏ ద్వారా కూటమి పాలనతో విజయం సాధించారన్నారు..ఈ నేపథ్యంలో దేశానికి ఒక దిక్సూచిలా పవర్ కళ్యాణ్ మహా శక్తిగా ఎదిగారని కొనియాడారు. రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ ఇతర పోర్ట్ లలో నెలకొన్న రైస్ స్మగ్లింగ్ మాఫియాను అడ్డుకున్నారని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు.. హిందువుల వైపు నిలబడ్డ తమ జనసేనానిని హతమార్చాలని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను కాపాడేందుకు జనసైనికులంతా నడుం బిగించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ను తాకాలంటే ముందు తమ జన సైనికులను దాటి వెళ్లాలన్నారు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జెడ్ ప్లస్ వివిఐపి సెక్యూరిటీని కల్పించాలని డిమాండ్ చేశారు.