- కేడర్ కు లోకేశ్ అభినందనలు
- 29 రోజుల్లో 50 లక్షలకు చేరుకున్న సభ్యత్వాలు
- కష్టపడే కార్యకర్తలకు రిఫరల్ సిస్టం ద్వారా గుర్తింపు
టీడీపీ మరో రికార్డ్ సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం దేశవ్యాప్తంగా పేరు తెస్తూనే ఉంది పార్టీకి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. పార్టీ స్థాపించిన గత 42 ఏళ్లలో అతి తక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తయింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కేవలం 29 రోజుల వ్యవధిలో 50 లక్షల మార్కును దాటడం గహణార్హం .
రాజంపేట నియోజకవర్గం 93,299 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలవగా , ఆ తర్వాత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం 82,176, కళ్యాణదుర్గం 77,720, పాలకొల్లు 72,720, మంగళగిరి 65,899 సభ్యత్వాలతో ముందు వరసలో ఉన్నాయి.
టెక్నాలజి బేస్ గా: ఈసారి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ కొనసాగుతోంది. లోకేశ్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టంకు శ్రీకారం చుట్టారు. సభ్యత్వ నమోదులో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ముందు వరసలో నిలిచిన వారిని మంత్రి లోకేశ్ నేరుగా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీంతో శాసనసభ్యులు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.