టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్…!

తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. ఉదయం నుంచి ఛానల్ ఓపెన్ కావడం లేదు. స్ట్రక్ అయినట్లు ఎర్రర్ మెసేజ్ వస్తోందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ ను పునరుద్ధరించేందుకు పార్టీ టెక్నికల్ వింగ్ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా ఛానల్ హ్యాక్ అవడంపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు.