చదువుకునే పిల్లలు లేకపోయినా అమ్మ ఒడి . … జగన్ హయాంలో సోషల్ సైకోలకు నజరానాలు

జగనన్న సర్కార్ లో ”అమ్మ ఒడి ‘ ‘ బడికి వెళ్లే పిల్లల తల్లుల ఖాతాలో వేసేవారు . ఇంతవరకు బాగానే ఉంది . ఇది చాలా మంచి స్కీం . అయితే అమ్మ ఒడి లబ్ధిదారుల పేరుతొ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లకు సొమ్ములు ట్రాన్స్ఫర్ చేసిన లెక్కలు తేలిపోతున్నాయి . అలాగే సొంత భూమి లేకపోయినా రైతు భరోసా స్కీం కింద కూడా సదరు వైసీపీ సోషల్ సైకోల అకౌంట్లకు సొమ్ములు చేరాయి . ఇదీ జగన్ సర్కార్ నిర్వాకం . ..

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌, ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌తో పాటు మరిన్ని ప్రభుత్వ విభాగాల సొమ్మును ‘సోషల్‌ సైకో’లకు కట్టబెట్టారని ఎప్పుడో స్పష్టమైంది. ఆయా కార్పొరేషన్లలో ఉద్యోగులుగా నియమించుకుని… వారి ద్వారా సోషల్‌ మీడియా పని చేయించుకున్నారు. కింది స్థాయిలో పని చేసిన వారికి ప్రభుత్వ పథకాల సొమ్ములు దోచిపెట్టినట్లు తాజాగా తేలింది. తాడేపల్లిలో పుట్టిన కంటెంట్‌కు రకరకాల బూతులు, మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు జతచేసి సోషల్‌ మీడియాలో పెట్టడమే ఈ ‘ఫ్యాక్టరీ’ పని! రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయిన సోషల్‌ సైకోలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఈ పోస్టులు పెట్టినందుకు మీకు జీతాలు ఇచ్చారా? ఇంకేమైనా చేశారా?’ అని ప్రశ్నించగా పలువురు అసలు విషయం బయటపెట్టారు.. తమకు చదువుకునే పిల్లలు లేకున్నా ‘అమ్మ ఒడి’ వచ్చేదని, వ్యవసాయం చేయకపోయినా ‘రైతుభరోసా’ ఇచ్చేవారని, మగ్గం చూడక పోయినా నేతన్న నేస్తం, ఆటో లేకున్నా ‘వాహన మిత్ర’ కింద లబ్ధి చేకూరిందని వెల్లడించారు. లబ్ధిదారుల జాబితాలో సోషల్‌ సైకోల పేర్లు చేర్చినట్లు గుర్తించిన పోలీసులు ‘ఇలా కూడా చేశారా’ అని ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాష్ట్ర స్థాయి సోషల్‌ మీడియా కన్వీనర్‌, ఉప కన్వీనర్‌కు వైసీపీ పార్టీ సొమ్ములు వేసిన లెక్కలు కూడా తాజాగా బయటపడ్డాయి . అయితే ఈ సొమ్ముల దుర్వినియోగంపై చంద్రబాబు – పవన్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి .