రైతులు ధాన్యం అమ్ముకునే ప్రక్రియను సులభతరం చేసిన సర్కార్
వాట్సాప్ ద్వారా సేవలు
రైతులు ధాన్యం విక్రయించేందుకు టైమ్ స్లాట్ విధానం
రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 73373 59375 నెంబరు ద్వారా ఏపీ ప్రభుత్వం సేవలు అందించనుంది. ఈ నెంబరుకు వాట్సాప్ లో హాయ్ అని సందేశం పంపగానే, ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి.
. రైతులు తమ ధాన్యం విక్రయించే క్రమంలో వారికి సమయం వృథా కాకుండా ఈ వాట్సాప్ నెంబరును తీసుకువచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మరొహర్ చెప్పారు. వాట్సాప్ ద్వారా రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, నిర్దేశించిన సమయంలో వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యం విక్రయించవచ్చని నాదెండ్ల వివరించారు. దీనివల్ల అనవసర ప్రయాస తప్పుతుందన్నారు .
ఈ వాట్సాప్ నెంబరు ద్వారా సేవలు పొందాలనుకునే రైతులు తొలుత తమ ఆధార్ కార్డుతో కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. రైతన్నలూ రెడీ కదా . ..