- నాలుగేళ్లుగా పడుతున్న కష్టాలకు చెక్
- ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు అలవెన్స్ లు
- అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లిస్తూ జీవో విడుదల
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం తీర్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్ తో పాటు నైట్ అవుట్ బిల్లులు చెల్లించే విధంగా సర్కార్ జీవో విడుదల చేసింది. హెడ్ క్వార్టర్ వెలుపల 6 నుండి 12 లోపు సిబ్బందికి అలవెన్స్ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీని వలన నైట్ అవుట్, అలవెన్స్ మంజూరై రాత్రి పూట డ్యూటీలకు వెళ్లే డ్రైవర్లకు, కండక్టర్లకు లబ్ధి చేకూరనుంది.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలు వారి సమస్యలపై అనేక పోరాటాలు చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు అలవెన్స్ లు మంజూరు చేయాలని ఆర్టీసీ సహా ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా అలవెన్స్ లు మంజూరు చేయడంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.