అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ . .

అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ . . నిధులపై కీలక పరిణామం- సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు పచ్చజెండా

రాజధాని అమరావతి నగరం సుస్థిర అభివృద్ది, రాజధాని నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank) సంయుక్తంగా ఇవ్వనున్న 15 వేల కోట్ల రూపాయల రుణ సహకార వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .

అమరావతి అభివృద్ధి కోసం . .: ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్డిఏను ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ప్రధాన రహదారులు, డక్ట్ లు, డ్రెయిన్ లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్​లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు.

సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు ఆమోదం: అమరావతి రాజధాని సుస్థిర అభివృద్ధికి ఏపీ సీఆర్‌డీఏ సమర్పించిన ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం లభించింది . ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టు వెల్లడించారు. మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టంచేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్​కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారం దిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.