Fake News: సోనియా, రాహుల్ గాంధీపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై జర్నలిస్ట్ పై కేసు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు బంగ్లాదేశ్ జర్నలిస్ట్ (Journalist) తో పాటు భారతీయ మహిళా సిబ్బందిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు(Case Register) చేశారు.

ఆగస్ట్ 31వ తేదీన అసత్య ప్రచారంపై పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ లీగల్ టీమ్ (Congress Leagal Team) ఫిర్యాదు చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. గాంధీ కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ప్రతిష్టను కించపరిచాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశారని కాంగ్రెస్ లీగల్ టీమ్ పేర్కొంది. ఈ మేరకు బంగ్లాదేశ్ కు చెందిన ఓ వార్తాపత్రిక బ్లిట్జ్ ఎడిటర్ అయిన జర్నలిస్ట్ సలా ఉద్దీన్ షోయబ్ చౌదరితో పాటు అదితిపై హై గ్రౌండ్స్ పోలీసులు (High Grounds Polices) కేసు నమోదు చేశారని తెలుస్తోంది. కాగా దీనిపై పోలీసులు విచారణ (Investigation) జరుగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.