Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం కేసు.. నోటీసులు జారీ.!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై పరువు నష్టం దావా కేసు (
Defamation suit case) నమోదైన సంగతి తెలిసిందే. మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా తమపై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఆయనపై పరువు నష్టం దావా వేసింది.

ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) లోని ప్రజాప్రతినిధుల కోర్టు (Representatives Court) సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తి వేస్తుందంటూ రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి ( BJP General Secretary) ఆరోపించారు. ఈ ప్రచారం కారణంగా ప్రజల్లో పార్టీపై అపనమ్మకంతో పాటు గందరగోళం ఏర్పడిందని తెలిపారు. కాగా పరువు నష్టం కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు (Notices) జారీ చేసిందన్న బీజేపీ తరపు న్యాయవాది ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యే విషయాన్ని ఇవాళ నిర్ణయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల (Revanth Comments) పై ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పరువు నష్టం కేసు పెట్టినట్లు వెల్లడించారు.