భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూత..!

Former Army Chief : భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూశారు. సోమవారం చెన్నై (Chennai) లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

జనరల్ పద్మనాభన్ డిసెంబర్ 5, 1940 న కేరళలోని త్రివేండ్రంలో జన్మించారు. డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (Rashtriya Indian Military College), పూణేలోని ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(National Defense Academy) లో విద్యను అభ్యసించారు. సుమారు 43 ఏళ్ల పాటు ఆర్మీలో కొనసాగారు. సెప్టెంబర్ 30, 2000 నుండి డిసెంబర్ 31, 2002 వరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ (Chief of Army Staff) గా బాధ్యతలు నిర్వహించారు.

జనరల్ పద్మనాభన్ ఆర్మీలో అందించిన సేవలకు విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం సహా పలు అవార్డులు వరించాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (Director General of Military Intelligence) కి పని చేసిన తరువాత జనరల్ పద్మనాభన్ నార్తర్న్ కమాండ్ కు జీఓసీగా నియామకం అయ్యారు. ఆ తరువాత ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పదోన్నతి పొందారు. ఇక 2002 లో ఆయన పదవీ విరమణ చేశారు.