జయకేతనం . . జనసేన 12 ఏళ్ల ప్రస్థానం..

పోటీ చేసిన మొదట్లో పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ సైతం ఓటమి చవిచూశారు .  అయినా మొక్కవోని దీక్షతో రాజకీయ పోరాటంలో కొనసాగారు .

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు”!! ఇది పవన్‌కల్యాణ్‌ నటించిన సినిమాలోని ఓ డైలాగ్. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ  అణగిమణిగా తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్‌కల్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఆయన, పదేళ్లపాటు కనీసం చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు. ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. వైఫల్యాలకు వెన్నుచూపకుండా  ఎదురొడ్డి నిలబడ్డారు.

 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పదేపదే  ప్రకటించి కట్టుబడ్డారు. టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టడంలో కీలకమయ్యారు. పదేళ్ల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు. ప్రజాపాలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీ ఆవిర్భావం, పోరాటం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరపురాని ఘట్టాలు! పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పార్టీ ఒడుదొడుకులు, ఒకసారి మననం చేసుకునేందుకు ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నారు .

2014లో రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించిందంటూ పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహించారు. ఈ అన్యాయం గురించి, ఏపీ హక్కుల గురించి ప్రశ్నించే గొంతుక కోసమంటూ అదే ఏడాది మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటుచేశారు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అప్పటికే కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ నేపథ్యం జనసేన పార్టీ పైన, పవన్‌ కల్యాణ్‌పైనా అనుమానాలకు తావిచ్చింది.

ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు సమయమూ తక్కువగానే ఉండటంతో పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు పలికారు. తెలుగుదేశం కూడా NDA కూటమిలో ఉండటంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు. అలా పవన్‌ తీసుకున్న నిర్ణయం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేకహోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్‌, బీజేపీతోపాటు, టీడీపీపైనా విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కాకుండా వామపక్షాలు, BSPతో కలిసి పోటీచేశారు.

  వెన్నుచూపని నైజం: 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్‌కల్యాణ్‌ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓడిపోయారు .   ఆ దఫా  వై ఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో అరాచక పాలనన సహించలేకపోయారు .    జగన్‌ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ఎదురుతిరిగి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి, గుంతలమయమైన రహదారులు వంటి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు. అదే జనసేనానాని ఈ రోజు సక్సెస్ నిలబెట్టింది .